NTV Telugu Site icon

Divyavani: కాంగ్రెస్ గూటికి దివ్యవాణి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఠాక్రే

Divyavani

Divyavani

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా.. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆమె టీడీపీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ఆ తర్వాత టీడీపీతో విభేదించి 2022లో పార్టీకి రాజీనామా చేసింది. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంది.. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది.

Read Also: Vizag Road Accident: స్కూల్‌ ఆటోను ఢీకొట్టిన లారీ.. రోడ్డుపై పల్టీలు కొట్టింది..!

ఇక, అసెంబ్లీ ఎన్నికల దివ్వవాణి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సహం లభించినట్లైంది. ఇప్పటికే బీజేపీ నుంచి విజయశాంతి సైతం హస్తం గూటికి చేరడంతో ఆమెకు ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తనకున్న సినీ గ్లామర్, ఫ్యాన్ పాలోయింగ్‌తో స్టార్ క్యాంపెయినర్‌గా ఇప్పటికే విజయశాంతి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. తాజాగా, మరోసినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీకీ ఫ్లస్ అనే చెప్పాలి. అయితే, దివ్వవాణి ఇప్పటి వరకు ఏపీ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది వేచి చూడాలి.