Site icon NTV Telugu

KCR: నేడు సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదే..!

Cm Kcr

Cm Kcr

తెలంగాణలో ఎన్నికలకు మరి కొన్ని రోజలు సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముమ్మరంగా ప్రచారం చేస్తు్న్నారు. కాగా, నిన్నటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే, ఇందులో భాగంగా నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలంతో పాటు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. మొత్తంగా 16 రోజుల పాటు కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో గులాబీ బాస్ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇక ఇవాళ పాలకుర్తి, నాగార్జున సాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?

ఇక, ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో తన ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముగిస్తారు. అంతకుముందు మొదటి విడత ప్రచారంలో దాదాపు 74 నియోజకవర్గాలలో ఆయన ప్రచారం చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి సింగిల్ గానే కేసీఆర్ ప్రచారాలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ ఈ సారి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి గజ్వేల్ అయితే.. మరోకటి కామారెడ్డి నియోజకవర్గం.. ఇక, నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

Exit mobile version