రాష్ట్రం మొత్తం మావైపే చూస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కాంగెస్, సీపీఐ, జనసమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మా కలయికతో బీఆర్ఎస్‌ను ఓడిస్తున్నాం. ప్రచార కో ఆర్డినేషన్ కమిటీ వేసుకొని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది’ అని తెలిపారు.
Also Read: Jaipur tinder murder Case: టిండర్‌లో పరిచయం, డేట్.. కట్ చేస్తే కిడ్నాప్, దారుణహత్య
అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘ఏ లక్ష్యం మేరకు తెలంగాణ సాధించుకున్నామో అది నెరవేరడం లేదు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదు. సకలజనులు పోరాటం చేస్తేనే రాష్ట్రం వచ్చింది. జేఏసీ ఆధ్వర్యంలో కొట్లాడినం.. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. మోడీ రాష్ట్రా ఏర్పాటుపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనే సాగుతుంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉద్యమకారులున్నారా. కాళేశ్వరం అద్భుతం అన్నారు ఏమైంది? కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కులాయా? పేపర్ లీకేజ్ లతో ఉద్యోగాల భర్తీ కాలేదు.
Also Read: GVL Narasimha Rao: దమ్ముంటే రేవంత్ బీసీ సీఎం ప్రకటన చేయాలి..
నిరుద్యోగులు కేసీఆర్‌పై కోపంగా ఉన్నారు. నియంత పరిపాలన సాగుతోంది. ప్రజాదర్బార్ ఏమైంది.. 5 లక్ష కోట్ల అప్పుల రాష్ట్రంగా మారింది. ఉపాధి అవకాశాలు లేవు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అన్నాడు.. అన్ని బంద్ అయ్యాయి. బీజేపీ కూడా బీఆర్ఎస్ కోసం పనిచేస్తుంది. కొత్తగూడెంలో సీపీఐని, మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం’ అని చాడ వ్యాఖ్యానించారు.