తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. అయితే, ప్రచారానికి మరో ఐదు రోజుల్లో గడువు ముగిసిపోతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగానే కమలం పార్టీ జాతీయ నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రచారం నిర్వహించారు. ఇక మరోమారు వారు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వస్తుండగా.. మోడీ రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.
Read Also: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అనంతరం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటారు. ఈ రోడ్‌షోల తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయి.. మళ్లీ ఒక్క రోజు విరామం తరువాత ఈ నెల 26, 27, 28వ తేదీలలో తెలంగాణలో పర్యటించేందుకు వస్తారని బీజేపీ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Read Also: Revanth Reddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం..
ఇక, అమిత్ షా 12 గంటలకు ఆర్మూర్ లో జరుగునున్న సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం లో రోడ్ షోలో పాల్గొంటారు.. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు.. సాయంత్రం 4.30 గంటలకు అంబర్ పేట నియోజకవర్గం రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు.
Read Also: Friday : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం ఇలా చెయ్యాల్సిందే?
మరోవైపు ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మేడ్చల్ లో బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, సాయంత్రం కార్వాన్, కంటోన్‌మెంట్‌లో రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్నాయి.