Site icon NTV Telugu

ఇదేందయ్యా ఇది.. iPhone 17 డిజైన్ను పూర్తిగా వాడేశారు.. ZTE Blade V80 Vita డిజైన్ లీక్..!

Zte Blade V80 Vita

Zte Blade V80 Vita

ZTE Blade V80 Vita: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ZTE తన బ్లేడ్ సిరీస్‌ను లాంచ్ చేసందుకు సిద్ధమవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ త్వరలో ZTE Blade V80 Vita అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అధికారికంగా ఈ ఫోన్ గురించి ZTE ఇంకా ప్రకటించకపోయినా.. ఓ ప్రముఖ టిప్‌స్టర్ ఈ ఫోన్ సంబంధించి మొదటి లీక్‌డ్ ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీక్‌డ్ రెండర్‌లో ZTE Blade V80 Vita నీలం (Blue) రంగులో కనిపించింది. ఫోన్‌కు తక్కువ బెజెల్స్, సెంటర్‌లో హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా, గుండ్రని మూలలతో ట్రెండీ లుక్ ఉంది. వెనుక భాగంలో పూర్తి వెడల్పుగా ఉండే దీర్ఘ చతురస్రాకార కెమెరా ఐలాండ్ ఉండగా.. దానిపై మూడు కెమెరాలు (Triple Rear Cameras), కుడివైపున LED ఫ్లాష్ కనిపిస్తున్నాయి. కెమెరా మాడ్యూల్ దిగువ కుడి మూలలో “Neo” అనే పదం ఉన్న ఎరుపు రంగు సర్కిల్ కూడా ఉంది. దీనిని గమనించినట్లయితే.. డిజైన్‌ పూర్తిగా Apple iPhone 17 Proని గుర్తు చేస్తోంది.

Pawan Kalyan: ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అవసరం.. భక్తుల భావాలను గౌరవించాలి..!

అలాగే ఫోన్ కుడి ఎడ్జ్‌లో ఎరుపు రంగు పవర్ బటన్, దాని పక్కన వాల్యూమ్ రాకర్ బటన్లు ఉన్నాయి. ఎడమ వైపున సిమ్ ట్రే, ఒక కస్టమైజబుల్ బటన్ ఉండే అవకాశం ఉంది. క్రింద భాగంలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, విడుదల తేదీపై కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే లీక్‌ల ప్రకారం ఈ ఫోన్ చవకైన మిడ్ రేంజ్ మోడల్‌గా, గత ఏడాది విడుదలైన ZTE Blade V70 కంటే మెరుగైన అప్‌గ్రేడ్లతో రానుందని అంచనా.

IP66+IP68+IP69 రేటింగ్స్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో Oppo Reno 14F 5G Star Wars Edition లాంచ్కు సర్వం సిద్ధం..!

గత సంవత్సరం నవంబర్‌లో చైనాలో విడుదలైన ZTE Blade V70లో 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 108MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా అందించబడింది. ఈ కొత్త ZTE Blade V80 Vita ఫోన్ డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఐఫోన్ తరహా స్టైల్, ట్రిపుల్ కెమెరా సెటప్, యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఇది బడ్జెట్ మార్కెట్లో కొత్త పోటీదారుగా నిలవనుంది. కంపెనీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version