ఇదేందయ్యా ఇది.. iPhone 17 డిజైన్ను పూర్తిగా వాడేశారు.. ZTE Blade V80 Vita డిజైన్ లీక్..!
- కొత్త బ్లేడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి ఇమేజ్ బయటకు
- వెనుక భాగంలో iPhone 17 Pro లాంటి పూర్తి వెడల్పు కెమెరా ఐలాండ్ డిజైన్.
- నీలం రంగులో ఆకర్షణీయ లుక్, సెంటర్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZTE Blade V80 Vita: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ZTE తన బ్లేడ్ సిరీస్‌ను లాంచ్ చేసందుకు సిద్ధమవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ త్వరలో ZTE Blade V80 Vita అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అధికారికంగా ఈ ఫోన్ గురించి ZTE ఇంకా ప్రకటించకపోయినా.. ఓ ప్రముఖ టిప్‌స్టర్ ఈ ఫోన్ సంబంధించి మొదటి లీక్‌డ్ ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీక్‌డ్ రెండర్‌లో ZTE Blade V80 Vita నీలం (Blue) రంగులో కనిపించింది. ఫోన్‌కు తక్కువ బెజెల్స్, సెంటర్‌లో హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా, గుండ్రని మూలలతో ట్రెండీ లుక్ ఉంది. వెనుక భాగంలో పూర్తి వెడల్పుగా ఉండే దీర్ఘ చతురస్రాకార కెమెరా ఐలాండ్ ఉండగా.. దానిపై మూడు కెమెరాలు (Triple Rear Cameras), కుడివైపున LED ఫ్లాష్ కనిపిస్తున్నాయి. కెమెరా మాడ్యూల్ దిగువ కుడి మూలలో “Neo” అనే పదం ఉన్న ఎరుపు రంగు సర్కిల్ కూడా ఉంది. దీనిని గమనించినట్లయితే.. డిజైన్ పూర్తిగా Apple iPhone 17 Proని గుర్తు చేస్తోంది.
Pawan Kalyan: ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అవసరం.. భక్తుల భావాలను గౌరవించాలి..!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
అలాగే ఫోన్ కుడి ఎడ్జ్‌లో ఎరుపు రంగు పవర్ బటన్, దాని పక్కన వాల్యూమ్ రాకర్ బటన్లు ఉన్నాయి. ఎడమ వైపున సిమ్ ట్రే, ఒక కస్టమైజబుల్ బటన్ ఉండే అవకాశం ఉంది. క్రింద భాగంలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, విడుదల తేదీపై కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే లీక్‌ల ప్రకారం ఈ ఫోన్ చవకైన మిడ్ రేంజ్ మోడల్‌గా, గత ఏడాది విడుదలైన ZTE Blade V70 కంటే మెరుగైన అప్‌గ్రేడ్లతో రానుందని అంచనా.
గత సంవత్సరం నవంబర్‌లో చైనాలో విడుదలైన ZTE Blade V70లో 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 108MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా అందించబడింది. ఈ కొత్త ZTE Blade V80 Vita ఫోన్ డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఐఫోన్ తరహా స్టైల్, ట్రిపుల్ కెమెరా సెటప్, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఇది బడ్జెట్ మార్కెట్లో కొత్త పోటీదారుగా నిలవనుంది. కంపెనీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?