రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
- ZENO 100 Pro స్మార్ట్‌ఫోన్ విడుదల
- ZENO 100 Proలో 6.6-అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
- UNISOC T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్, Android 15 Go Edition
- ZENO 10,000mAh పవర్ బ్యాంక్ , ZENO 20,000mAh పవర్ బ్యాంక్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZENO 100 Pro: జీనో (ZENO) సంస్థ భారత మార్కెట్లో కొత్తగా ZENO 100 Pro స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెండు కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరలో మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇదే సిరీస్‌లో ZENO Lite మోడల్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది.
ఈ ZENO 100 Proలో 6.6 అంగుళాల HD+ (720×1612 పిక్సెల్స్) డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. దీంతో స్క్రోలింగ్, యాప్ నావిగేషన్ మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్ప్లే గరిష్టంగా 480 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. కెమెరా కటౌట్ చుట్టూ బ్యాటరీ, కాల్స్, నోటిఫికేషన్లను చూపించే Dynamic Bar ఫీచర్ కూడా ఇందులో ఉంది.
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ఈ ఫోన్‌కు 2.2GHz ఆక్టా-కోర్ UNISOC T7100 (12nm) ఉంది. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MP1 GPUను ఉపయోగించారు. ఇందులో 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ లభిస్తుంది. అవసరమైతే మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. అలాగే వర్చువల్ RAM సాయంతో అదనంగా 5GB వరకు ర్యామ్ ను పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ Android 15 Go Editionపై పనిచేస్తుంది.
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ:
ZENO 100 Proకు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో ఫోన్ పడిపోవడం, కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. అలాగే అల్ట్రా లింక్ టెక్నాలజీ( Ultralink Technology) ద్వారా నెట్వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా మెరుగైన కనెక్టివిటీని అందిస్తామని కంపెనీ పేర్కొంది.
బ్యాటరీ & మరిన్ని ఫీచర్లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీను అందించారు. ఇది 10W ఛార్జింగ్ కు మాత్రమే మద్దతు ఇస్తుంది. బాక్స్‌లోనే 10W ఛార్జర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్లో 8MP రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. IR Blaster సాయంతో టీవీలు, ఎయిర్ కండిషనర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను రిమోట్‌లా నియంత్రించవచ్చు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ తో పాటు ఫేస్ అన్‌లాక్ సదుపాయం కూడా ఉంది. అదనంగా DTS సౌండ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త ZENO పవర్ బ్యాంక్‌లు:
స్మార్ట్‌ఫోన్‌తో పాటు ZENO రెండు కొత్త పవర్ బ్యాంక్‌లను కూడా విడుదల చేసింది. ఇందులో ZENO 10,000mAh, ZENO 20,000mAh పవర్ బ్యాంక్ లు ఉన్నాయి. ZENO 10,000mAh పవర్ బ్యాంక్ లు 22.5W ఫాస్ట్ ఛార్జింగ్, డిజిటల్ బ్యాటరీ డిస్ప్లే, 3A USB Type-C కేబుల్,
బరువు 176 గ్రాములు, సిల్వర్ రంగులో అందుబాటులో ఉంది.
ZENO 20,000mAh పవర్ బ్యాంక్ లో 45W ఫాస్ట్ ఛార్జింగ్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లకు కూడా ఛార్జింగ్ సపోర్ట్, ఇన్‌బిల్ట్ 36 సెం.మీ బ్రైడెడ్, Type-C కేబుల్, డిజిటల్ డిస్ప్లే, బరువు 310 గ్రాములు, గ్రే రంగులో ఉంటుంది. భారత మార్కెట్లో ZENO కొత్త ఉత్పత్తులు ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి.
ధరలు:
* ZENO 100 Pro (3GB + 64GB) – రూ. 8,599.
* ZENO Lite (2GB + 64GB) – రూ. 7,999.
* ZENO 10,000mAh పవర్ బ్యాంక్ – రూ. 1,299 (ప్రారంభ ఆఫర్‌తో).
* ZENO 20,000mAh పవర్ బ్యాంక్ – రూ. 2,069 (ప్రారంభ ఆఫర్‌తో).
తాజావార్తలు
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!