Site icon NTV Telugu

YouTube Premium: యూట్యూబ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా 2 నెలల ప్రీమియం! ఇలా క్లెయిమ్ చేసుకోండి..

Youtube Premium

Youtube Premium

YouTube Premium Free: యూట్యూబ్ తన యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు 2 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా నెలకు రూ.149 ఖర్చయ్యే ఈ ప్లాన్‌ను ఇప్పుడు ‘జీరో కాస్ట్’తో పొందే అవకాశం కల్పిస్తోంది. దీనిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!

మీరు ఈ ఆఫర్‌కు అర్హులైతే, చాలా సులభంగా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ మొబైల్‌లో YouTube యాప్ ఓపెన్ చేయండి. తర్వాత ప్రొఫైల్ సెక్షన్‌లోని ‘You’ ట్యాబ్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు ‘Get YouTube Premium’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 2 నెలల ఫ్రీ ట్రయల్ ఆఫర్ కనిపిస్తుంది. అక్కడ మీ పేమెంట్ మెథడ్ (Card/UPI) వివరాలను జోడించాల్సి ఉంటుంది. ట్రయల్ కాలంలో మీ నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. ఒకవేళ మీకు నచ్చకపోతే, 2 నెలలు పూర్తి కావడానికి ముందే ఎప్పుడైనా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందంటే..
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. గూగుల్ దీనిపై స్పష్టమైన నిబంధనలు వెల్లడించనప్పటికీ, కొన్ని కీలక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ యూట్యూబ్ ప్రీమియం తీసుకోని వారికి ఈ ఆఫర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్‌కు ఈ 2 నెలల ఆఫర్ కనిపిస్తుండగా, కొందరు ఐఫోన్ యూజర్లకు మాత్రం కేవలం ఒక నెల ట్రయల్ మాత్రమే కనిపిస్తోంది.

ప్రీమియం సేవలతో కలిగే ప్రయోజనాలు ఇవే!
ఉచిత ట్రయల్ పీరియడ్‌లో మీరు కొన్ని బెనిఫిట్స్‌ను పొందుతారు. అవి ఏంటంటే.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఎటువంటి యాడ్స్ రావు, దీనివల్ల అంతరాయం లేని అనుభూతి కలుగుతుంది. యూట్యూబ్‌లో ఉన్న లక్షలాది పాటలను ఎలాంటి యాడ్స్ లేకుండా వినవచ్చు. అలాగే యాప్ క్లోజ్ చేసినా లేదా ఫోన్ లాక్ చేసినా వీడియో లేదా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. మీకు నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటర్నెట్ లేనప్పుడు కూడా చూసుకోవచ్చు. మెరుగైన 1080p వీడియో క్వాలిటీ, స్మార్ట్ డౌన్‌లోడ్ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండవచ్చు. ఇప్పుడే మీ అకౌంట్‌లో ఈ ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

READ ALSO: BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గిఫ్ట్.. ఉచితంగానే ఆ సేవలు!

Exit mobile version