Site icon NTV Telugu

YouTube Music: 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ‘యూట్యూబ్ మ్యూజిక్’.. కొత్త ఫీచర్స్ ఇవే!

Youtube Music

Youtube Music

YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. 2015లో లాంచ్ అయిన ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రీమియం తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని వినియోగదారులు వారికి ఇష్టమైన ఆల్బమ్స్, ప్లేలిస్టులపై కామెంట్స్ పెట్టే సౌకర్యం కల్పించనుంది. అలాగే, “టేస్ట్ మ్యాచ్ ప్లేలిస్టులు” అనే కొత్త ఫీచర్‌ని కూడా అందిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో పాటలపై మాత్రమే కామెంట్స్ చేసే అవకాశం ఉంది. అయితే, ఆల్బమ్స్, ప్లేలిస్టులకు మాత్రం డౌన్‌లోడ్స్, బుక్‌మార్క్స్, షేర్ వంటి ఆప్షన్లు మాత్రమే ఉండేవి. ఇకపై వినియోగదారులు మొత్తం ఆల్బమ్స్, ప్లేలిస్టులపై కూడా కామెంట్స్ పెట్టి తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కలుగనుంది.

BCCI: బీసీసీఐలో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?

కొత్తగా తీసుకొచ్చిన మరో ముఖ్య ఫీచర్ “టేస్ట్ మ్యాచ్ ప్లేలిస్టులు”. వీటి ద్వారా మీ అభిరుచికి సరిపోయే సంగీత అభిరుచులు ఉన్న వినియోగదారులు ఒకే ప్లేలిస్టులో కలసి పాటలు వినగలరు, అలాగే కొత్త పాటలను కనుకొనగలరు. ఇవి రోజువారీగా ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతాయి. అందులో చేరిన వినియోగదారుల లిజనింగ్ హిస్టరీ ఆధారంగా కొత్త పాటలు జోడించబడతాయి. ఇవే కాకుండా.. యూట్యూబ్ మ్యూజిక్, ఆర్టిస్టుల అధికారిక మ్యూజిక్ వీడియోల్లో వచ్చిన వ్యూయింగ్ మైలురాళ్లను హైలైట్ చేయనుంది. అలాగే, Bandsintown తో భాగస్వామ్యం చేస్తూ వినియోగదారులు తమ ప్రాంతంలో జరగబోయే సంగీత కచేరీల వివరాలు యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో తెలుసుకునే అవకాశం ఇవ్వనుంది.

Asia Cup 2025లో టీమిండియా జెర్సీ మారనుందా? ఆ కొత్త బిల్ కారణమా!

ఇటీవల యూట్యూబ్ మ్యూజిక్ “ఫ్యాన్ బ్యాడ్జీలు” అనే ఫీచర్‌ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా అభిమానులు తమ ఇష్టమైన ఆర్టిస్టుల పట్ల ఇష్టాన్ని చూపించవచ్చు. “First to Watch”, “Top Listener” వంటి బ్యాడ్జీలతో టాప్ ఫ్యాన్స్‌ను గుర్తించనుంది. వీటితోపాటు, అభిమానుల కోసం కొత్త నోటిఫికేషన్ వ్యవస్థ కూడా తీసుకొస్తోంది. దీని ద్వారా ఫేవరెట్ ఆర్టిస్టుల నుంచి రాబోయే మ్యూజిక్ రిలీజ్‌లు, కొత్త మెర్చండైజ్ డ్రాప్‌లు, ఈవెంట్ డేట్స్ వంటి అప్‌డేట్స్ వినియోగదారులకు వెంటనే చేరవేస్తుంది. మొత్తానికి, యూట్యూబ్ మ్యూజిక్ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల అనుభవాన్ని మరింత ఇన్టరాక్టివ్‌గా, ఎంగేజింగ్‌గా మార్చే దిశగా ఈ కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది.

Exit mobile version