YouTube Music: 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ‘యూట్యూబ్ మ్యూజిక్’.. కొత్త ఫీచర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. 2015లో లాంచ్ అయిన ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రీమియం తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్లకుపైగా సబ్స్క్రైబర్లను సంపాదించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని వినియోగదారులు వారికి ఇష్టమైన ఆల్బమ్స్, ప్లేలిస్టులపై కామెంట్స్ పెట్టే సౌకర్యం కల్పించనుంది. అలాగే, “టేస్ట్ మ్యాచ్ ప్లేలిస్టులు” అనే కొత్త ఫీచర్‌ని కూడా అందిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో పాటలపై మాత్రమే కామెంట్స్ చేసే అవకాశం ఉంది. అయితే, ఆల్బమ్స్, ప్లేలిస్టులకు మాత్రం డౌన్లోడ్స్, బుక్‌మార్క్స్, షేర్ వంటి ఆప్షన్లు మాత్రమే ఉండేవి. ఇకపై వినియోగదారులు మొత్తం ఆల్బమ్స్, ప్లేలిస్టులపై కూడా కామెంట్స్ పెట్టి తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కలుగనుంది.
BCCI: బీసీసీఐలో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?
Also Read
- రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
- వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
- Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
- ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్‌టాప్.. ఆసుస్ VM441 AiO భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
కొత్తగా తీసుకొచ్చిన మరో ముఖ్య ఫీచర్ “టేస్ట్ మ్యాచ్ ప్లేలిస్టులు”. వీటి ద్వారా మీ అభిరుచికి సరిపోయే సంగీత అభిరుచులు ఉన్న వినియోగదారులు ఒకే ప్లేలిస్టులో కలసి పాటలు వినగలరు, అలాగే కొత్త పాటలను కనుకొనగలరు. ఇవి రోజువారీగా ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతాయి. అందులో చేరిన వినియోగదారుల లిజనింగ్ హిస్టరీ ఆధారంగా కొత్త పాటలు జోడించబడతాయి. ఇవే కాకుండా.. యూట్యూబ్ మ్యూజిక్, ఆర్టిస్టుల అధికారిక మ్యూజిక్ వీడియోల్లో వచ్చిన వ్యూయింగ్ మైలురాళ్లను హైలైట్ చేయనుంది. అలాగే, Bandsintown తో భాగస్వామ్యం చేస్తూ వినియోగదారులు తమ ప్రాంతంలో జరగబోయే సంగీత కచేరీల వివరాలు యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో తెలుసుకునే అవకాశం ఇవ్వనుంది.
Asia Cup 2025లో టీమిండియా జెర్సీ మారనుందా? ఆ కొత్త బిల్ కారణమా!
ఇటీవల యూట్యూబ్ మ్యూజిక్ “ఫ్యాన్ బ్యాడ్జీలు” అనే ఫీచర్‌ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా అభిమానులు తమ ఇష్టమైన ఆర్టిస్టుల పట్ల ఇష్టాన్ని చూపించవచ్చు. “First to Watch”, “Top Listener” వంటి బ్యాడ్జీలతో టాప్ ఫ్యాన్స్‌ను గుర్తించనుంది. వీటితోపాటు, అభిమానుల కోసం కొత్త నోటిఫికేషన్ వ్యవస్థ కూడా తీసుకొస్తోంది. దీని ద్వారా ఫేవరెట్ ఆర్టిస్టుల నుంచి రాబోయే మ్యూజిక్ రిలీజ్లు, కొత్త మెర్చండైజ్ డ్రాప్‌లు, ఈవెంట్ డేట్స్ వంటి అప్డేట్స్ వినియోగదారులకు వెంటనే చేరవేస్తుంది. మొత్తానికి, యూట్యూబ్ మ్యూజిక్ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల అనుభవాన్ని మరింత ఇన్టరాక్టివ్గా, ఎంగేజింగ్‌గా మార్చే దిశగా ఈ కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది.
తాజావార్తలు
-
Sridhar Babu : హైదరాబాద్‌లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
-
Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
-
Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
-
West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!