38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Clip Earbuds Launched Globally: షావోమీ గ్లోబల్ మార్కెట్లో కొత్త ఓపెన్ ఇయర్ క్లిప్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. “షియోమీ క్లిప్” పేరుతో వచ్చిన ఈ ఆడియో డివైజ్ చెవిలోపల పెట్టుకునే సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా క్లిప్ తరహా డిజైన్‌తో రూపొందించారు. చెవి రంధ్రాలను పూర్తిగా మూసివేయకుండా సంగీతాన్ని వినేలా వీటిని తయారు చేశారు. తక్కువ బరువు, మెరుగైన ఆడియో క్వాలిటీ, AI నాయిస్ రిడక్షన్, 38 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డిజైన్, ఆడియో ఫీచర్లు
Xiaomi Clip ఇయర్‌బడ్స్ ఒక్కొక్కటి కేవలం 5.5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇందులో షేప్ మెమరీ అల్లాయ్ బ్రిడ్జ్‌ను ఉపయోగించారు. ఈ ప్రత్యేక డిజైన్ చెవి చుట్టూ క్లిప్‌లా అమరుతుంది. చెవి రంధ్రాలను మూసివేయకుండా ఉండటంతో ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తున్నప్పటికీ చుట్టుపక్కల శబ్దాలను వినవచ్చు. ఆడియో కోసం 11mm డైనమిక్ డ్రైవర్‌ను అందించారు. ఇందులో మైక్రోక్రిస్టలైన్ మెటల్ కోటెడ్ డయాఫ్రాగమ్‌ను ఉపయోగించారు. సౌండ్ లీకేజీని తగ్గించేందుకు డైరెక్షనల్ అకౌస్టిక్ ఛానెల్స్‌ను కూడా అందించారు. Hi-Res Audio Wireless సర్టిఫికేషన్‌తో పాటు LHDC 5.0 ఆడియో కోడెక్‌కు సపోర్ట్ ఉంది.
Also Read
- 21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
- 200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
- 200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
- GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
AI నాయిస్ రిడక్షన్
కాల్ మాట్లాడేటప్పుడు మెరుగైన వాయిస్ క్వాలిటీ కోసం ఇందులో త్రీ మైక్రోఫోన్ అర్రేను అందించారు. దీనికి అదనంగా VPU బోన్ కండక్షన్ సెన్సార్‌ను ఉపయోగించారు. AI ఆధారిత యాంబియంట్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ చుట్టుపక్కల శబ్దాలను తగ్గించి వాయిస్‌ను స్పష్టంగా వినిపించేందుకు సహాయపడుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP57 రేటింగ్‌ను అందించారు. దీంతో రోజువారీ వినియోగంలో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.
బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు
బ్యాటరీ విషయానికి వస్తే Xiaomi Clip ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్ అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 38 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఈ ఛార్జింగ్ కేస్‌ను RingBox పేరుతో అందిస్తున్నారు. Xiaomi Earbuds యాప్ ద్వారా ఇయర్‌బడ్స్ సెట్టింగ్స్‌ను నిర్వహించుకోవచ్చు. Xiaomi డివైజ్‌ల మధ్య ఆడియోను సులభంగా స్విచ్ చేసుకునే సదుపాయం ఉంది. అంతేకాకుండా ఛార్జింగ్ కేస్‌ను గుర్తించేందుకు Apple Find My ఫీచర్‌కు కూడా సపోర్ట్ అందించారు.
ధర
గ్లోబల్ మార్కెట్లో Xiaomi Clip ఇయర్‌బడ్స్ ధర 149.90 యూరోలు (USD 164 / సుమారు రూ.15,370)గా నిర్ణయించారు. షావోమీ అధికారిక ఆన్లైన్ ఛానెల్స్, అధీకృత రిటైలర్ల ద్వారా ఈ ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Kulgam Encounter: అల్లాహ్‌ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్‌కౌంటర్‌కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
-
RC17 Heroine: హీరోయిన్ రేసులో ఐదుగురు కుర్ర భామలు.. సుకుమార్ మనసులో ఎవరున్నారు?
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!