Xiaomi Google TV: కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా చిన్న ఇల్లు, బెడ్‌రూమ్ లేదా చిన్న గదిలో ఉపయోగించడానికి 32 ఇంచుల టీవీ కావాలనుకునే వారికి షియోమీ (Xiaomi) మంచి ఎంపికను అందిస్తోంది. కంపెనీకి చెందిన Xiaomi A Series 32 ఇంచుల HD Ready LED Smart Google TV ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ఆడియో, హెచ్‌డీఆర్ 10, 200కు పైగా ఉచిత లైవ్ ఛానెల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో చిన్న స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన ఎంపికగా నిలుస్తుంది.
ఈ షియోమీ టీవీలో 80 సెంటీమీటర్ల (32 ఇంచుల) LED డిస్‌ప్లే అందించారు. ఇది 1366 x 768 పిక్సెల్స్ HD Ready రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో గదిలో వివిధ కోణాల నుంచి టీవీని వీక్షించవచ్చు. HDR10 సపోర్ట్ కూడా అందించారు. ఈ టీవీ గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే Xiaomi TV+ ద్వారా 200కు పైగా ఉచిత లైవ్ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. గూగుల్ క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్ ఉండటంతో మొబైల్, ల్యాప్‌టాప్, పీసీ నుంచి టీవీకి కంటెంట్‌ను కాస్ట్ చేసుకోవచ్చు. రిమోట్‌లో వాయిస్ సెర్చ్ సదుపాయం కూడా ఉంది.
మంచి ఆడియో అనుభవం కోసం ఇందులో రెండు స్పీకర్లను అందించారు. ఇవి 20W RMS సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual:X టెక్నాలజీలకు సపోర్ట్ ఉంది. ఇక పనితీరు విషయానికి వస్తే A53 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పాటు 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం రెండు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉన్నాయి. హెడ్‌ఫోన్ జాక్ సదుపాయం ఉండటంతో హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ Xiaomi A Series 32 ఇంచుల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 48% తగ్గింపుతో రూ.12,999కు లభిస్తోంది. దీనికి అదనంగా అందుబాటులో ఉన్న ఆఫర్లను వర్తింపజేస్తే ధర మరింత తగ్గుతుంది. అదనపు ఆఫర్లు వర్తింపజేస్తే దీని ధర మరింత తగ్గి రూ.11,599కే లభిస్తుంది. అలాగే 3 నెలల EMI సదుపాయం రూ.3,894 నుంచి ప్రారంభమవుతుంది. ఇండస్‌ఇండ్, RBL క్రెడిట్ కార్డులపై రూ.1,400 వరకు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుపై రూ.1,030 వరకు తగ్గింపు పొందవచ్చు.

