Xiaomi 17 Max Launched: చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘Xiaomi 17 Max’ లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేయడం ప్రారంభించింది. Xiaomi 17 సిరీస్‌లో మళ్లీ ‘Max’ మోడల్‌ను తీసుకొస్తుండటంతో టెక్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ లో రాబోతుంది.
డిజైన్ పరంగా చూస్తే Xiaomi 17 మోడల్‌ను పోలి ఉండే ఈ ఫోన్ బ్లాక్, వైట్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ‘సూపర్ పిక్సెల్’ డిస్‌ప్లేను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్క్రీన్ 2K డిస్‌ప్లేకు సమానమైన విజువల్ అనుభూతిని ఇస్తుందని Xiaomi చెబుతోంది.
ఫోటోగ్రఫీ విషయంలో కూడా Xiaomi 17 Max భారీ అప్‌గ్రేడ్‌తో రానుంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఈ కెమెరా 1/1.4 అంగుళాల సెన్సర్, f/1.65 అపర్చర్‌తో వస్తోంది. అలాగే 3x టెలిఫోటో కెమెరా, లైకా ఆప్టిక్స్ సపోర్ట్ కూడా ఇవ్వనున్నారు. లీక్‌ల ప్రకారం ఇందులో f/2.4 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్‌లో Qualcomm నుండి వచ్చిన కొత్త Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు.
Xiaomi 17 సిరీస్‌లోని ఇతర ఫోన్ల మాదిరిగానే ఈ చిప్‌సెట్ హైఎండ్ పనితీరును అందించనుంది. ముఖ్యంగా 8000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా మారింది. Xiaomi 17 సిరీస్‌లో ఇదే అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యమని సమాచారం. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుందని లీకర్లు చెబుతున్నారు.
