సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఛార్జ్ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్ లలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. మెటా నేపథ్యంలో వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్ (x) కూడా అదే తరహాలో నడిచింది.. ఇప్పుడు ఆడియో, వీడియో కాల్స్ ను చేసుకొనే వెసులుబాటును కలిగించునున్నారు.. అందుకు సంబందించిన స్క్రీన్ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఈ కాల్స్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా ఎక్స్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చెయ్యాలి.. తర్వాత ప్రైవసీ లోకి వెళ్లి, సేఫ్టీ లోకి వెళ్లి,ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్ ను ఎనెబుల్ చేసుకోవాలి.. ఈ సదుపాయం ద్వారా ఎవరికీ ఫోన్ నంబరు ఇవ్వకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు గతంలో మస్క్ ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు..
గతంలో ఎక్స్ లో ఎన్నో మార్పులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు కాలింగ్ ఫీచర్ వల్ల ఎక్కువ మంది ఎక్స్ ను వినియోగించ వచ్చునని ఎక్స్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు… ఈ ఫీచర్ వల్ల కస్టమర్ కు మెరుగైన ఫలితాలను అందుకుంటాడని అంటున్నారు.. ఇక భవిష్యత్ లో మరిన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది..
Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023