Site icon NTV Telugu

Wooden Citroen 2CV: కోట్లు పలికిన చెక్క కారు…ప్రత్యేకతలు ఏంటంటే?

Wood Car

Wood Car

ఆటో మొబైల్స్ రంగంలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది.. ఒకదానికి మించి మరొకటి.. అదిరిపోయే టెక్నాలజీ తో ఔరా అనిపించేలా కొత్త మోడల్ కార్లు మార్కెట్ లో దర్శనం ఇస్తున్నాయి.. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాల ను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. ఆ కారు ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం..

చెక్కతో తయారైన కారు పేరు ‘సిట్రోయెన్ 2సీవీ’.. చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఏంటి నమ్మబుద్ది కావడం లేదు కదు.. కానీ ఇదే నిజం.. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటు లో ఉంది. దీనిని ‘మిచెల్ రాబిల్లార్డ్’ అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు… అందుకే కారు చూడటాని కి చాలా అందంగా ఉంది.. ఈ కారును అతను తయారు చెయ్యడానికి ఐదేళ్లు పట్టిందని ఆయన తెలిపారు..

ఈ కారును ఈ ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో ‘జీన్ పాల్ ఫావాండ్’ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు.. పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియం లో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.. ఆ కారును తన బిడ్డగా భావిస్తున్నాడు.. ఈ కారు కు మించిన రేంజులో మరో కారు ‘సిట్రోయెన్ డిఎస్’ను కూడా చెక్కతో రూపొందించాలని ఆయన భావిస్తున్నారు.. మొత్తానికి ఈ కారు గురించి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది..

Exit mobile version