Site icon NTV Telugu

SIM Card Mystery: సిమ్ కార్డ్ మిస్టరీ.. ప్రతి సిమ్ కార్డ్ మూల ఎందుకు తెగిపోయి ఉంటుంది.?

Sim

Sim

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఫోన్ ఎంత ఖరీదైనదైనా, అందులో ఉండే ఒక చిన్న ‘సిమ్ కార్డు’ (SIM Card) లేకపోతే అది కేవలం ఒక డబ్బా ముక్కతో సమానం. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీకి చెందిన సిమ్ కార్డు అయినా ఒక మూలలో కట్ చేసి ఉంటుంది. ఇది కేవలం స్టైల్ కోసం చేసిన డిజైన్ అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

Nithin- VI Anand: ‘నో బాడీ.. నో రూల్స్’.. కాన్సెప్ట్‌తో నితిన్ నెక్స్ట్ మూవీ పోస్టర్ రిలిజ్..
గందరగోళానికి చెక్ పెట్టేందుకే..

మొదట్లో సిమ్ కార్డులు పూర్తి దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. అంటే నాలుగు వైపులా మూలలు సమానంగా ఉండేవి. దీనివల్ల వినియోగదారులు సిమ్ కార్డును ఫోన్‌లో పెట్టేటప్పుడు అది ఏ వైపు పెట్టాలో తెలియక తరచూ గందరగోళానికి గురయ్యేవారు. పొరపాటున సిమ్ రివర్స్‌లో పెడితే ఫోన్ పని చేయకపోవడమే కాకుండా, చిప్‌పై గీతలు పడి అది పాడైపోయేది. ఈ సమస్యను పరిష్కరించడానికి టెలికాం కంపెనీలు సిమ్ కార్డుకు ఒక మూల కట్ చేయాలని నిర్ణయించాయి. ఆ కట్ ఆధారంగా సిమ్ ఏ దిశలో పెట్టాలో యూజర్లకు సులభంగా అర్థమవుతుంది.

ఫోన్ హార్డ్‌వేర్ రక్షణ కోసం

సిమ్ కార్డు మధ్యలో ఉండే గోల్డెన్ చిప్, ఫోన్‌లోని సిమ్ రీడర్ పిన్స్‌కు సరిగ్గా టచ్ అవ్వాలి. ఒకవేళ సిమ్ కార్డును తప్పు దిశలో పెట్టి బలవంతంగా లోపలికి నొక్కితే, ఫోన్ లోపల ఉండే సెన్సిటివ్ పిన్స్ విరిగిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ రిపేర్ ఖర్చులతో పాటు, సిమ్ కార్డు కూడా పనికిరాకుండా పోతుంది. అందుకే ఆ కట్ ఒక ‘సేఫ్టీ గైడ్’లా పనిచేస్తూ, కార్డును కేవలం ఒకే ఒక సరైన దిశలో లోపలికి వెళ్లేలా చేస్తుంది.

క్రెడిట్ కార్డు సైజు నుండి నానో స్థాయికి.. 

మీకు తెలుసా? 1990వ దశకంలో సిమ్ కార్డులు మన ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండేవి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఫోన్లు స్లిమ్‌గా మారాయి, దాంతో సిమ్ కార్డులు కూడా చిన్నవిగా మారుతూ వచ్చాయి. మినీ సిమ్, మైక్రో సిమ్, నానో సిమ్.. ఇలా సైజులు మారినా, ఆ ‘కట్ కార్నర్’ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇది ఇప్పుడు ఒక గ్లోబల్ స్టాండర్డ్ డిజైన్‌గా మారిపోయింది. మనం చాలా సాధారణంగా చూసే ఈ చిన్న కట్ వెనుక ఇంత పెద్ద టెక్నికల్ లాజిక్ ఉందన్నమాట. కేవలం ఒక మూల కట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల శ్రమ, సమయం , వారి ఖరీదైన ఫోన్లు సురక్షితంగా ఉంటున్నాయి.

EXclusive : విజయ్ దేవరకొండ ’14’ టైటిల్ ఇదే

Exit mobile version