వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. WhatsApp Web నుంచే వాయిస్, వీడియో కాల్స్ స్టార్ట్!
- వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్..
- WhatsApp Web నుంచే వాయిస్, వీడియో కాల్స్ స్టార్ట్..
- త్వరలోనే WhatsApp Web నుంచే గ్రూప్ కాల్స్ చేసుకునే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp వినియోగదారులకు శుభవార్త.. ఇకపై WhatsApp Webలోనే వాయిస్, వీడియో కాల్స్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేయకుండానే, నేరుగా బ్రౌజర్ నుంచే కాల్ చేసే అవకాశం ఈ ఫీచర్ ద్వారా లభించనుంది. కాగా, ఈ కొత్త ఫీచర్‌ను తొలిసారిగా WABetaInfo గుర్తించింది. ప్రస్తుతం ఇది WhatsApp Web బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న కస్టమర్లు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రారంభ దశలో వ్యక్తిగత (One-to-One) చాట్స్ లో మాత్రమే కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నారు.
Read Also: Lahore 1947: ఆమిర్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘లాహోర్ 1947’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Xiaomi FX Mini LED Series: అమెజాన్ ఫైర్ టీవీ ఇంటిగ్రేషన్‌తో.. షియోమి FX మినీ LED సిరీస్ విడుదలకు సిద్ధం
- Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
- Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6s Gen 2 చిప్
- షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
WhatsApp Webలో కాలింగ్ ఎలా పనిచేస్తుంది?:
అర్హత ఉన్న వినియోగదారులు వ్యక్తిగత చాట్‌లోకి వెళ్లి, అక్కడ కనిపించే వాయిస్ లేదా వీడియో కాల్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కాల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో సురక్షితంగా జరుగుతాయని WhatsApp స్పష్టం చేసింది.
Linux యూజర్లకు లాభం:
ఈ అప్డేట్ ముఖ్యంగా Linux యూజర్లకు చాలా ఉపయోగకరంగా మారనుంది. ఎందుకంటే Linux కోసం ఇప్పటి వరకు అధికారిక WhatsApp డెస్క్‌టాప్ యాప్ లేదు.. వారు పూర్తిగా WhatsApp Webపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు బ్రౌజర్ నుంచే కాలింగ్ చేయడానికి అవకాశ ఉంటుంది.
Read Also: 6.75-inch HD+ డిస్ప్లే, 6500mAh బ్యాటరీ.. కేవలం Rs. 14,999లకే OPPO K14x 5G లాంచ్
స్క్రీన్ షేరింగ్ సపోర్ట్:
WhatsApp Web వీడియో కాల్స్‌లో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్లు వీడియో కాల్ సమయంలో తమ స్క్రీన్‌లోని కంటెంట్‌ను రియల్ టైమ్‌లో షేర్ చేయవచ్చు. కానీ, ఈ సదుపాయం వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపింది కంపెనీ.
త్వరలోనే గ్రూప్ కాలింగ్:
రిపోర్టుల ప్రకారం, WhatsApp ప్రస్తుతం వెబ్ క్లయింట్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది విడుదలైన తర్వాత: సుమారు 32 మంది వరకు గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే, కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని వారాల్లో అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ కాలింగ్ ఫీచర్ మాత్రం మరింత టెస్టింగ్ తర్వాత విడుదల చేయనున్నారు. అయితే, WhatsApp Webను మరింత శక్తివంతమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చే దిశగా సంస్థ అడుగులు వేస్తుంది అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
-
Xiaomi FX Mini LED Series: అమెజాన్ ఫైర్ టీవీ ఇంటిగ్రేషన్‌తో.. షియోమి FX మినీ LED సిరీస్ విడుదలకు సిద్ధం
-
Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
-
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
-
Trump: వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?