WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Web: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్స్ తీసుక వస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే మరో కీలక అప్డేట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ వెబ్ (WhatsApp Web) ద్వారానే నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేయడం, స్వీకరించడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత (One-on-One) కాల్స్‌తో పాటు గ్రూప్ కాల్స్‌కు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.
వాట్సాప్ వెబ్ నుంచే కాల్స్:
కొత్త వెబ్ కాలింగ్ (Web Calling) ఫీచర్‌తో సపోర్ట్ ఉన్న వెబ్ బ్రౌజర్ ద్వారా WhatsApp Webలోనే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు కంపెనీ పలు అదనపు ఫీచర్లను కూడా అందించింది. వాటిలో స్క్రీన్ షేరింగ్, ఎమోజీ రియాక్షన్స్, ప్రత్యేక కాల్స్ ట్యాబ్, పూర్తి కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, వెబ్ బ్రౌజర్ ద్వారా చేసే కాల్స్ కూడా End-to-End Encryptionతో రక్షించబడతాయని వాట్సాప్ తెలిపింది. అలాగే ఈ కాల్స్‌కు ఎలాంటి సమయ పరిమితి ఉండదని, పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
Also Read
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
- Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
- Honor X6e: హానర్ X6e రిలీజ్.. 7,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్
కాల్ ట్రాన్స్ఫర్ ఫీచర్:
ఈ అప్డేట్లో అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ కాల్ ట్రాన్స్ఫర్ (Call Transfer). దీని ద్వారా ఇప్పటికే కొనసాగుతున్న గ్రూప్ కాల్‌ను మధ్యలో డిస్కనెక్ట్ చేయకుండా ఒక డివైస్ నుంచి మరో డివైస్‌కు మార్చుకోవచ్చు. ఉదాహరణకు మొబైల్లో ప్రారంభించిన కాల్‌ను WhatsApp Web లేదా డెస్క్‌టాప్ యాప్‌కు మార్చుకోవచ్చు. అవసరమైతే మళ్లీ మొబైల్‌కు కూడా అదే కాల్‌ను కొనసాగిస్తూ మారవచ్చు.
వెయిటింగ్ రూమ్ సౌకర్యం:
గ్రూప్ కాల్స్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు వెయిటింగ్ రూమ్ (Waiting Room) ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. కాల్ లింక్ క్రియేట్ చేసే సమయంలో “Require approval to join” అనే ఆప్షన్‌ను ఆన్ చేస్తే, లింక్ ద్వారా జాయిన్ అయ్యే వారు ముందుగా వెయిటింగ్లో ఉంటారు. హోస్ట్ అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే వారు కాల్లో చేరగలరు.
QuickHD, Noise Suppression:
వీడియో కాల్ నాణ్యతను మెరుగుపరచేందుకు QuickHD అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో కాల్ ప్రారంభమైన కొన్ని సెకన్లలోనే హై-డెఫినిషన్ (HD) వీడియో అందుబాటులోకి వస్తుంది. అలాగే Noise Suppression ఫీచర్ ద్వారా కాల్ సమయంలో చుట్టూ ఉండే బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి వాయిస్‌ను మరింత స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. ఈ ఫీచర్‌ను కాల్ జరుగుతున్న సమయంలోనే ఇన్-కాల్ సెట్టింగ్స్‌లో అవసరానికి అనుగుణంగా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్లన్నింటినీ వాట్సాప్ దశలవారీగా విడుదల చేస్తోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వినియోగదారులకు ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?