WhatsApp Updates: ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసారి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇందులో లైవ్ ఫోటోలు, మెటా ఏఐ ఆధారిత చాట్ థీమ్స్, వీడియో కాల్స్ కోసం బ్యాక్‌గ్రౌండ్ జనరేషన్, డాక్యుమెంట్ స్కానింగ్ వంటివి ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఇకపై ఐఓఎస్ యూజర్లు లైవ్ ఫోటోలను, ఆండ్రాయిడ్ యూజర్లు మోషన్ ఫోటోలను వాట్సాప్‌లో పంపవచ్చు. లైవ్ ఫోటోలు అంటే, కెమెరా బటన్ నొక్కడానికి ముందు, ఆ తర్వాత కొన్ని సెకన్ల వీడియో క్లిప్, శబ్దంతో సహా రికార్డ్ అవుతుంది.
మెటా ఏఐ ఫీచర్లు..
కస్టమైజ్డ్ చాట్ థీమ్స్:
యూజర్లు తమకు నచ్చిన విధంగా మెటా ఏఐని ఉపయోగించి కొత్త చాట్ థీమ్స్‌ను సృష్టించుకోవచ్చు. యూజర్ ఇచ్చే సందేశాలు, ఆదేశాల ఆధారంగా ఏఐ కొత్త ఇమేజ్‌లను రూపొందిస్తుంది.
DGP Jitender: వారందరికీ కృతజ్ఞతలు అంటూ భావోద్వేగానికి గురైన డీజీపీ..
వీడియో కాల్ బ్యాక్‌గ్రౌండ్స్:
వీడియో కాల్స్ కోసం కూడా ఏఐతో బ్యాక్‌గ్రౌండ్స్‌ను సృష్టించుకోవచ్చు. చాట్‌లో ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు కూడా ఏఐ బ్యాక్‌గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు:
ఫియర్‌లెస్ బర్డ్, స్కూల్ డేస్, లేదా వెకేషన్ ప్యాక్‌ల వంటి కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు అందుబాటులోకి వచ్చాయి.
సులభమైన గ్రూప్ సెర్చ్:
గ్రూప్ పేరు గుర్తులేకపోయినా, చాట్‌లో ఉన్న వారి పేరుతో గ్రూప్‌ను సులభంగా వెతకవచ్చు. వాట్సాప్ ఆ యూజర్‌తో మీరు ఉన్న గ్రూపులను చూపిస్తుంది.
Police Raid: ఫాంహౌస్‌పై దాడి.. అక్రమంగా ఉంటున్న 51 మంది విదేశీయులు పట్టివేత
డాక్యుమెంట్ స్కానింగ్:
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా డాక్యుమెంట్లను స్కాన్ చేయడం, క్రాప్ చేయడం, సేవ్ చేయడం, నేరుగా యాప్ ద్వారా పంపడం వంటివి చేయవచ్చు. ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ మెటా ఏఐ ఫీచర్లు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం. ప్రస్తుతానికి ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేషియన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్, టాగలాగ్, థాయ్, వియత్నామీస్ భాషలలో అందుబాటులో ఉన్నాయి.
