WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్ లేకుండా సీక్రెట్ మెసేజ్‌లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన WhatsApp మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. సీక్రెట్ మెసేజ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫీచర్ ద్వారా, మెసేజ్ చదివిన వెంటనే అది ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. కొంతమంది వినియోగదారులకు మాత్రమే పరీక్షార్థం అందుబాటులో ఉంది.
Read Also: Hanumantha Rao Chowdary: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత..
Also Read
- OnePlus Turbo 7 Pro 5G: 10,000mAh బ్యాటరీతో OnePlus కొత్త 5G ఫోన్.. 200MP కెమెరా, 100W ఛార్జింగ్!
- Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
- Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
- 38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.12.2లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది. దీనికి “After Reading” అనే పేరు ఇచ్చారు. అంటే, ఒకసారి మెసేజ్ చదివిన తర్వాత అది స్వయంచాలకంగా తొలగిపోతుంది. ఇప్పటికే వాట్సాప్‌లో “Disappearing Messages” అనే ఫీచర్ ఉంది. ఇందులో వినియోగదారులు ఒక నిర్దిష్ట కాలపరిమితిని (ఉదాహరణకు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు) సెట్ చేస్తారు. ఆ సమయం పూర్తయ్యాక మెసేజ్‌లు డిలీట్ అవుతాయి. అయితే కొత్తగా తీసుకొస్తున్న “After Reading” ఆప్షన్లో, కాలపరిమితి అవసరం ఉండదు. మెసేజ్ చదివిన వెంటనే అది ఆటోమేటిక్‌గా మాయమవుతుంది.
ఉదాహరణకు, ఒక వినియోగదారు సీక్రెట్ మెసేజ్ పంపాలనుకుంటే, మెసేజ్ పంపే సమయంలో “After Reading” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు రిసీవర్ మెసేజ్ చదివిన వెంటనే అది డిలీట్ అవుతుంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా WABetaInfo పంచుకుంది. ఇందులో “After Reading” ఆప్షన్‌తో పాటు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు, ఆఫ్ వంటి ఎంపికలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్ సాధారణ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తానికి, ఈ కొత్త ఫీచర్ వాట్సాప్‌లో ప్రైవసీని మరింత పెంచే అవకాశం ఉంది. సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం ఇది వినియోగదారులకు ఉపయోగపడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..