వాట్సాప్ యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది షెడ్యూల్ ఫీచర్ తో వాట్సాప్ లో అప్డేట్ చేశారు. టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో ఈ షెడ్యూల్ కాల్ వినియోగించుకోవచ్చని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో ఉద్యోగులు, స్నేహితులు, ఫ్యామిలీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ తో వీడియో కాల్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read Also:Sexual Assault: స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై.. రేడియాలజిస్ట్ అత్యాచారయత్నం..
అయితే.. మనం ఎందుకు మీటింగ్ కాల్ పెడుతున్నామనే ఉద్దేశ్యం కూడా ఇందులో చెప్పుకొవచ్చు. ఈ గ్రూప్ మీటింగ్ కాల్ లో ఎవరిని సెలక్ట్ చేసుకోవాలో.. వద్దు అనే ఆఫ్షన్ కూడా దీనిలో ఉంటుంది. జనరేట్ అయిన లింకును కాపీ చేసి.. ఎవరైతే ఇందులో పాల్గొంటారో.. వారికి షేర్ చేసే ఆఫ్షన్ కూడా ఉంది. కాల్ మొదలయ్యే ముందు.. మనం ఎవరినైతే కనెక్ట్ చేయాలనుకుంటామో.. వారికి ఆటో మేటిక్ గా నోటిఫికేషన్ వెళ్లిపోతుంది. అనంతరం అందరూ కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఈ ఫీచర్ తో ఎక్కువగా.. గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవచ్చని.. వాట్సాప్ నిర్వాహాకులు చెబుతున్నారు. వాట్సాప్ లో షెడ్యూల్ ఫీచర్ అందుబాటులోకి రావడంపై వినియోగదారలు.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
