ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్ వాట్సాప్.. ఈ యాప్ యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. మార్కెట్లోకి ఎన్నో మెసేజింగ్ యాప్స్ వస్తున్నా పోటీనీ తట్టుకునేలా వాట్సాప్ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది… ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ వాట్సాప్ లో ఎక్కువ మంది వాడేది గ్రూప్ కాలింగ్ ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది.. ఈసారి డబుల్ చేసింది. అంటే ఈసారి ఏకంగా 31 మంది కనెక్ట్ అయ్యేలా చేసింది..
ఇదిలా ఉండగా..ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ మీట్, గూగుల్ మీట్ వంటి వాటికి పోటీగా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఐఓఎస్ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ సహాయంతో ఒకేసారి 31 మంది గ్రూప్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఐఫోన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ ఫీచర్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
ముందుగా మీరు ఏ గ్రూప్ కు కాల్ చెయ్యాలని అనుకున్నారో ఆ గ్రూప్ను ఓపెన్ చెయ్యాలి..అనంతరం స్క్రీన్ పైభాగంలో ఉన్న వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ బటన్‌పై నొక్కాలి. అనంతరం గ్రూప్ కాల్ చేయాలనుకుంటున్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ గ్రూప్‌లో 31 మందికంటే ఎక్కువ ఉంటే మీరు మాట్లాడుకోవాలనకుంటున్న 31 మందిని ఎంచుకోవాలి. ఆ తర్వాత వీడియో కాల్ లేదా ఆడియో కాల్ బటన్ ను నొక్కితే సరిపోతుంది..