NTV Telugu Site icon

WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్టేటస్ ఫిల్టరింగ్ ఫీచర్ బెనిఫిట్స్ ఇవే..!

Whatsapp

Whatsapp

ప్రముఖ ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కల్పించేందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. ‘స్టేటస్ అప్‌డేట్స్‌ ఫిల్టర్’ పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.. యూజర్లు స్టేటస్ అప్‌డేట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు వెర్టికల్ లిస్ట్‌లో స్టేటస్ అప్‌డేట్లను చూసుకోవచ్చు..

వాట్సాప్ బీటా 2.23.25.3 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లకు కొత్త ఫీచర్ విడుదల అవుతోంది. అప్‌డేట్ అందుకున్న యూజర్లు ఇప్పుడు మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.. మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్స్ ను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బీటా టెస్టర్లు అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో స్టేటస్ సెక్షన్ కింద కొత్తగా సీ ఆల్ బటన్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయగానే అన్ని స్టేటస్ అప్‌డేట్స్‌ వర్టికల్ లిస్టులో కనిపిస్తాయి. ఈ లిస్టుపైన స్టేటస్ అప్‌డేట్స్‌ ఫిల్టర్ చేసుకోవడానికి వీలుగా నాలుగు ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ ఫిల్టర్స్‌లో ఆల్, రీసెంట్, వ్యూయిడ్, మ్యూటెడ్ ఉన్నాయి. ఇందులో ఆల్ పైన నొక్కితే అన్ని స్టేటస్ అప్‌డేట్స్‌ కనిపిస్తాయి. రీసెంట్ పై ట్యాప్ చేస్తే లేటెస్ట్ స్టేటస్‌లు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. దీనివల్ల ఓల్డ్ స్టేటస్‌లు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా మోస్ట్ రీసెంట్‌వి సింపుల్‌గా చూసుకోవచ్చు.. ఇంకా అద్భుతమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది..