Site icon NTV Telugu

New Feature in Whatsapp: వాట్సాప్ లో ఈ ఫీచర్.. ఎంత ఉపయోగమో తెలుసా?

Whatsap Hand

Whatsap Hand

ఇప్పుడు వాట్సాప్ అందరికీ ఎంతో ఉపయోగకరంగా మారింది. వాట్పాప్‌ ని కొందరు దుర్వినియోగం చేసేవారున్నారు. త్వరలో వాట్సాప్ తీసుకురాబోయే ఫీచర్ల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల ముందుకు తీసుకురాబోతోంది. చాట్‌ పేజీలో అవసరమైన మెసేజ్‌లను వెతకడం కష్టం. అందుకే ఈ మెసేజ్ లను సులువుగా వెతికేందుకు వీలుగా కొత్త సెర్చ్‌ ఆప్షన్‌ తీసుకురానుందని తెలుస్తోంది.

Read Also: Cellphone Thieves: సెల్ ఫోన్ దొంగల హడావిడి.. ఆరోజే భారీగా కొట్టేశారు

ప్రస్తుతం టెక్ట్స్‌తో సెర్చ్‌ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్‌తో సెర్చ్‌ చేసే అద్బుత అవకాశం రాబోతోంది. దీంతో యూజర్లు తేదీల వారీగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్‌ చేసి చూసే అవకాశం ఎంతో దూరంలో లేదు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లకు సెర్చ్‌ బార్‌పై క్లిక్ చేస్తే క్యాలెండర్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే క్యాలెండర్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీకు కావాల్సిన తేదీ సెలెక్ట్ చేస్తే.. ఆయా తేదీల్లో మీరు పంపిన, మీకు వచ్చిన మెసేజ్‌లు చాట్‌ పేజీలో కనిపిస్తాయి. అలా కిందకు స్క్రోల్‌ చేస్తూ తర్వాతి, ముందు రోజు మెసేజ్‌లను కూడా యూజర్‌ చూడొచ్చు. దీనివల్ల యూజర్‌ ఏ రోజు ఏయే మెసేజ్‌లు పంపారనే వివరాలతో పాటు, మెసేజ్‌ సెర్చింగ్ సులువుగా ఉంటుంది. మనం పంపిన మెసేజ్ లలో మనం ఏ కంటెంట్, ఫోటోలు పంపామో తెలుసుకునే అవకాశం వుంటుంది. అయితే ఈ ఫీచర్ కోసం కొంతకాలం వెయిట్ చేయకతప్పదు మరి. ఐఓఎస్‌ బీటా యూజర్లకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా త్వరలో సౌకర్యం కలిగించనుంది.

Read Also: Ponniyan Selvan: ‘రాచ్చస మావయ్య’ గా మారిన కార్తీ.. చచ్చు బుద్ది మారదంటూ శోభిత ఆగ్రహం

Exit mobile version