టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16ని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తెచ్చింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 మ్యాక్స్‌తో పాటు కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా.. ఆపిల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఏదైనా ఫోన్‌ని చూసినట్లయితే లేదా గూగుల్ వెళ్లి ఆపిల్ ఐ ఫోన్ ఫోటోను చూస్తే ప్రతి ఫోటోలో సమయం 9:41 కనిపిస్తుంది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 16 చిత్రాలలో కూడా 9:41 సమయం కనిపించింది. దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం…
READ MORE: JK Encounter: ఉదంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
దీని వెనుక కథ ఏమిటి?
సాదారణంగా అన్ని ఐఫోన్ ప్రోడక్ట్ లు ప్రారంభించే సమయంలో సమయం ఒకేలా ఉంటుంది. ఐఫోన్‌లు ప్రారంభించబడినప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. ఆపిల్ పరికరాల్లో 9:41 ఏఎమ్ ని ప్రదర్శించే సంప్రదాయం.. చరిత్రలో ఒక నిర్దిష్ట క్షణం నుంచి గుర్తించబడింది. 2007లో స్టీవ్ జాబ్స్ మొదటి ఐఫోన్‌ను ఆవిష్కరించారు. జనవరి 9, 2007న శాన్ ఫ్రాన్సిస్కోలోని మాస్కోన్ సెంటర్‌లో స్టీవ్ జాబ్స్ విప్లవాత్మక ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన పరికరాన్ని ఆవిష్కరించిన ఖచ్చితమైన క్షణం 9:42 ఏఎమ్ .. అయితే, ఒక సంవత్సరం తర్వాత.. 2008లో ఐఫోన్ 3G లాంచ్ సమయంలో పరికరం పరిచయం చేసిన వాస్తవ సమయానికి సరిపోయేలా టైమ్ స్టాంప్ 9:41 ఏఎమ్ కి సర్దుబాటు చేయబడింది.
READ MORE:Delhi: రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలు.. సోనియా ఇంటి దగ్గర సిక్కులు ఆందోళన