Site icon NTV Telugu

VLC Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై భారత ప్రభుత్వం నిషేధం..!!

Vlc Media Player

Vlc Media Player

VLC Media Player: అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ VLC మీడియా ప్లేయర్ ఇకపై భారతదేశంలో పని చేయదు. ఎందుకంటే VLC మీడియా ప్లేయర్‌పై భారత ప్రభుత్వం రెండు నెలల కిందటే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. మన దేశంలో VLC మీడియా ప్లేయర్, డౌన్‌లోడ్ లింక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు కుదరడం లేదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను ఉపయోగించుకుంటోందని, అందుకే ఐటీ చట్టం-2000 ప్రకారం భారత ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Asteroids : భూమిపైకి ఆస్టరాయిడ్ల దండయాత్ర.. ఏ క్షణమైనా..

దీర్ఘకాలంగా దేశంలో కొనసాగుతున్న సైబర్ దాడుల్లో భాగంగా హానికరమైన మాల్వేర్ లోడర్‌ను అమలు చేయడానికి చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada VLC మీడియా ప్లేయర్‌ను ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు గుర్తించారు. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను నిషేధిస్తున్నట్లు కంపెనీ లేదా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ట్విట్టర్‌లోని కొంతమంది వినియోగదారులు ఇప్పటికీ వీఎల్‌సీ మీడియా ప్లేయర్ పరిమితులను కనుగొంటున్నారు. గగన్‌దీప్ సప్రా అనే వినియోగదారుడు VLC వెబ్‌సైట్‌కు సంబంధించి ఓ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశాడు. అందులో అది ఐటీ చట్టం-2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ఆదేశాల మేరకు వెబ్‌సైట్ బ్లాక్ చేయబడిందని చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికే ACT Fibernet, Jio, Vodafone-ideaతో పాటు ఇతర అన్ని ప్రధాన ISPలలో VLC మీడియా ప్లేయర్ బ్లాక్ చేయబడిందని వెల్లడించారు.

Exit mobile version