IP68+IP69 రేటింగ్స్, 200MP Samsung HP5 కెమెరా, 7,000mAh భారీ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Vivo Y500 Pro..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y500 Pro: వివో సంస్థ ఇప్పటికే రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను టీజ్ చేయడంతో పాటు.. ఆ మొబైల్ సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ధృవీకరించింది. ఆ మొబైల్ ఏదో కాదు.. ఇది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన Vivo Y500 సిరీస్‌లో కొత్త మోడల్‌గా చేరనుంది. నివేదికల ప్రకారం Vivo Y500 Pro నవంబర్ 10న చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అధికారికంగా లాంచ్ కానుంది.
New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం
Also Read
- Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
- Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
డిస్ప్లే విషయానికి వస్తే.. Vivo Y500 Pro 6.67 అంగుళాల OLED డిస్ప్లేను 1.5K రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. గేమింగ్ ప్రేమికులకు MOBA టైటిల్స్‌లో 120fps HD గేమ్‌ప్లే సపోర్ట్‌ను అందించగలదని వివో ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 తో వస్తుంది. దీనితో ఇది కొత్త సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్తో విడుదలైన మొదటి నాన్ ఫ్లాగ్షిప్ వివో ఫోన్‌గా నిలుస్తుంది. కెమెరా పరంగా Vivo Y500 Proలో 200 మెగాపిక్సెల్ Samsung HP5 ప్రైమరీ సెన్సార్‌ను అమర్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది.
Karthika Deepam: దీపారాధనలో 99 శాతం మంది ఈ తప్పులే చేస్తున్నారు!
ఇక ఈ ఫోన్లో 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ హ్యాండ్సెట్ IP68, IP69 రేటింగ్‌లతో దుమ్ముతో పాటు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. శాటిన్ ఫినిష్‌తో కూడిన యాంటీ గ్లేర్ గ్లాస్ బ్యాక్ దీని లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా చేస్తుంది. ఇక హార్డ్‌వేర్ విషయానికి వస్తే Vivo Y500 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో Vivo V2516A మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. ఇది MediaTek Dimensity 7400 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో రెండు క్లస్టర్లు ఉన్నాయి. ఈ మొబైల్ గీక్‌బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ సింగిల్-కోర్లో 1,059 పాయింట్లు, మల్టీ-కోర్లో 3,006 పాయింట్లు సాధించింది.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?