NTV Telugu Site icon

Vivo Y36: మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?

Vivi Y36

Vivi Y36

మార్కెట్ లో వివో మొబైల్స్ కు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే..చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ వివో నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో కస్టమర్ల అభిరుచుల మేరకు మరో కొత్త మొబైల్ ను అదిరిపోయే ఫీచర్స్ తో, ఆకట్టుకొనే ధరతో మార్కెట్ లోకి వదిలారు.. ఆ ఫోనే Vivo Y36 ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో వై సిరీస్‌లో వివో వై 36 స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది..ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇదే విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్‌-రీడబుల్ డిస్‌ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది.. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే.. 8జీబీ ర్యామ్‌128జీబీ స్టోరేయ్‌ వేరియంట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 16,999గా ఉంది. డైనమిక్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ వైబ్రాంట్ గోల్డ్, మెటోర్ బ్లాక్ వంటి రెండు కలర్స్ లలో లభిస్తోంది..

ఈ ఫోన్ 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, 50 + 2 ఎంపీ రియర్‌ కెమెరా తో రానుంది. ఆరా స్క్రీన్ లైట్‌తో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే 44W ఫ్లాష్ ఛార్జ్ తో రానుంది.. ఐసీఐసీఐ హెచ్డీఎఫ్సి కార్డ్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు ధరతో లభిస్తోంది.. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా కలిగి ఉంది.. ఈఎంఐ ఆఫషన్స్ కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు..