NTV Telugu Site icon

Vivo X80 : భారత విపణిలోకి వివో ఎక్స్‌80.. ఫీచర్స్‌ అదుర్స్‌..

Vivo X80

Vivo X80

రోజుకో అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్‌లు అడుగుపెడుతున్నాయి. అలాగే వివో కంపెనీ కూడా అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడల్స్‌ను వినియోదారుల ముందకు తీసుకువస్తోంది. అయితే తాజాగా మరో స్మార్ట్‌ ఫోన్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది వివో. మే 18న భారత్‌లో వివో న్యూ ఎక్స్‌80 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. భార‌త్‌లో వివో ఎక్స్‌80 ప్రొ లాంఛ్‌ను టీజ‌ర్ ద్వారా నిర్ధారించగా.. చైనా, మ‌లేషియాల్లో తొలుత ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ కానున్నాయి. వివో ఎక్స్‌80 ప్రొ ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది.

ఇక ఎక్స్‌80 ప్రొప్ల‌స్‌ను రాబోయే రోజుల్లో లాంఛ్ చేస్తుందా లేదా అనే విష‌యాన్ని మాత్రం వివో ప్రస్తుతానికి వెల్ల‌డించ‌లేదు. వివో ఎక్స్‌80 ప్రొ, వివో ఎక్స్80 స్మార్ట్‌ఫోన్లు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేను క‌లిగి ఉన్నాయి. వివో ఎక్స్‌80 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో వినియోగుదారులకు అందనుంది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 12 అవుటాఫ్ ఆఫ్ ది బాక్స్ ఆప‌రేటింగ్ సిస్టంపై ర‌న్ అవుతాయి. ఎక్స్80 ప్రొ 4700ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగిఉండ‌గా, ఎక్స్80 4500ఎంఏహెచ్ బ్యాటరీని క‌లిగిఉంది. రెండు స్మార్ట్‌ఫోన్లు 80డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌ను క‌లిగిఉండ‌గా ఎక్స్‌80 ప్రొ 50వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు తీసుకురానుంది వివో.