Vivo X500e Launched: వివో X500 సిరీస్‌ను మరిన్ని మార్కెట్లకు విస్తరిస్తోంది. ఇప్పటికే Vivo X500, X500 Pro, X500 Pro Max మోడళ్లను పరిచయం చేసిన కంపెనీ.. తాజాగా Vivo X500e పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ గతేడాది విడుదలైన Vivo X300eకు ఇది సక్సెసర్‌గా వచ్చింది. తాజాగా రష్యాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరా, స్లిమ్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
Vivo X500e స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 2,750 x 1,260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 1,800 నిట్స్ హై బ్రైట్నెస్, 5,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 4nm టెక్నాలజీతో తయారైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 8GB LPDDR4X ర్యామ్‌ను జత చేశారు. అలాగే 256GB, 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా దీనికి 16GB వరకు ఎక్స్‌పాండబుల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
కెమెరా విభాగంలో వెనుకవైపు OIS సపోర్ట్‌తో ఉన్న 50MP Sony LYTIA 700V మెయిన్ కెమెరాను అందించారు. దీనికి జోడీగా 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్ కలిగిన 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటో ఫోకస్ సపోర్ట్‌తో కూడిన 50MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200mAh సామర్థ్యం కలిగిన BlueVolt బ్యాటరీని అమర్చారు. ఇది 90W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
డిజైన్ విషయానికి వస్తే.. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 7.69mm మందంతో ఉంటుంది. దీని బరువు 203 గ్రాములు మాత్రమే. గ్లాస్ బ్యాక్ ప్యానెల్, మెటల్ ఫ్రేమ్‌తో రూపొందించారు. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC, eSIM, Bluetooth 5.4, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం Vivo X500e రష్యా మార్కెట్లో మాత్రమే విడుదలైంది. అయితే దీని ధర, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ విడుదలపై కూడా ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.

