ప్రత్యేక రెడ్ వెర్షన్, 200MP టెలిఫోటో కెమెరాలతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 సిరీస్ లాంచ్ కు సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X300: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) తన కొత్త ఫ్లాగ్‌షిప్ X300 సిరీస్‌ను భారతదేశంలో డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ సిరీస్ భారత్‌లో మాత్రం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro అనే రెండు ప్రీమియమ్ మోడళ్లను అందిస్తున్నారు. అయితే ఈ లాంచ్‌ను పూర్తి ఈవెంట్‌గా నిర్వహిస్తారా..? లేదా సాఫ్ట్ లాంచ్‌గా చేయబోతున్నారా..? అనే వివరాలు వివో ఇంకా ప్రకటించలేదు.
Maruti Grand Vitara Recall: గ్రాండ్ విటారాలో సాంకేతిక లోపం.. 39,000 కార్లు రీకాల్
Also Read
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్.!
వివో ఈ సిరీస్‌తో పాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన టెలీఫోటో ఎక్సటెన్డేర్ కిట్ (Telephoto Extender Kit)ను కూడా భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో Zeiss 2.35x టెలికన్వర్టర్ లెన్స్‌లు ఉంటాయి. ఇవి వివో ‘టెలికన్వర్టర్’ మోడ్‌తో కలిసి పనిచేస్తాయి. అలాగే ఆటోమేటిక్ లెన్స్ రికగ్నిషన్ కోసం NFC సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా భారత మార్కెట్‌లోకి రానున్న Vivo X300 మోడళ్లు 3nm ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. ఇందులో Pro Imaging VS1, V3+ ఇమేజింగ్ చిప్‌లు ఉండటం వల్ల కెమెరా పనితీరు మరింత మెరుగుపడుతుంది. రెండు మోడళ్లు తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే OriginOS 6 పై నడుస్తాయి, ఇది స్మూత్ UI, వేగవంతమైన ప్రదర్శన, మెరుగైన AI ఆప్టిమైజేషన్‌లను అందిస్తుంది.
Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం..
కెమెరా విషయంలో Vivo X300 Pro మోడల్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు ప్రత్యేక విందు అనే చెప్పాలి. ఇందులో Zeiss ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYT-828 ప్రైమరీ కెమెరా (f/1.57), 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.0), 200MP HPB APO టెలిఫోటో కెమెరా (f/2.67) ఉన్నాయి. వీటితో పాటు సెల్ఫీ కోసం ముందు భాగంలో 50MP Samsung JN1 కెమెరాను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ Vivo X300 మోడల్ కూడా కెమెరా పరంగా బాగానే ఉంటుంది. ఇందులో 200MP HPB ప్రైమరీ కెమెరా (f/1.68) OISతో, 50MP Sony LYT-602 టెలిఫోటో లెన్స్ (f/2.57) OISతో, 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. దీనిలో కూడా ముందు భాగంలో 50MP JN1 సెల్ఫీ కెమెరానే అమర్చారు. డిసెంబర్ 2న అధికారిక లాంచ్ అనంతరం మరిన్ని వివరాలు, ధరలు, ఆఫర్లు బయటికొచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!