Site icon NTV Telugu

ప్రత్యేక రెడ్ వెర్షన్, 200MP టెలిఫోటో కెమెరాలతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 సిరీస్ లాంచ్ కు సిద్ధం..!

Vivo X300

Vivo X300

Vivo X300: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) తన కొత్త ఫ్లాగ్‌షిప్ X300 సిరీస్‌ను భారతదేశంలో డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ సిరీస్ భారత్‌లో మాత్రం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro అనే రెండు ప్రీమియమ్ మోడళ్లను అందిస్తున్నారు. అయితే ఈ లాంచ్‌ను పూర్తి ఈవెంట్‌గా నిర్వహిస్తారా..? లేదా సాఫ్ట్ లాంచ్‌గా చేయబోతున్నారా..? అనే వివరాలు వివో ఇంకా ప్రకటించలేదు.

Maruti Grand Vitara Recall: గ్రాండ్ విటారాలో సాంకేతిక లోపం.. 39,000 కార్లు రీకాల్

వివో ఈ సిరీస్‌తో పాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన టెలీఫోటో ఎక్సటెన్డేర్ కిట్ (Telephoto Extender Kit)ను కూడా భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో Zeiss 2.35x టెలికన్వర్టర్ లెన్స్‌లు ఉంటాయి. ఇవి వివో ‘టెలికన్వర్టర్’ మోడ్‌తో కలిసి పనిచేస్తాయి. అలాగే ఆటోమేటిక్ లెన్స్ రికగ్నిషన్ కోసం NFC సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా భారత మార్కెట్‌లోకి రానున్న Vivo X300 మోడళ్లు 3nm ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. ఇందులో Pro Imaging VS1, V3+ ఇమేజింగ్ చిప్‌లు ఉండటం వల్ల కెమెరా పనితీరు మరింత మెరుగుపడుతుంది. రెండు మోడళ్లు తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే OriginOS 6 పై నడుస్తాయి, ఇది స్మూత్ UI, వేగవంతమైన ప్రదర్శన, మెరుగైన AI ఆప్టిమైజేషన్‌లను అందిస్తుంది.

Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం..

కెమెరా విషయంలో Vivo X300 Pro మోడల్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు ప్రత్యేక విందు అనే చెప్పాలి. ఇందులో Zeiss ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYT-828 ప్రైమరీ కెమెరా (f/1.57), 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.0), 200MP HPB APO టెలిఫోటో కెమెరా (f/2.67) ఉన్నాయి. వీటితో పాటు సెల్ఫీ కోసం ముందు భాగంలో 50MP Samsung JN1 కెమెరాను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ Vivo X300 మోడల్ కూడా కెమెరా పరంగా బాగానే ఉంటుంది. ఇందులో 200MP HPB ప్రైమరీ కెమెరా (f/1.68) OIS‌తో, 50MP Sony LYT-602 టెలిఫోటో లెన్స్ (f/2.57) OIS‌తో, 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. దీనిలో కూడా ముందు భాగంలో 50MP JN1 సెల్ఫీ కెమెరానే అమర్చారు. డిసెంబర్ 2న అధికారిక లాంచ్ అనంతరం మరిన్ని వివరాలు, ధరలు, ఆఫర్లు బయటికొచ్చే అవకాశం ఉంది.

Exit mobile version