Site icon NTV Telugu

Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్‌200టీ’ రివ్యూ!

Vivo X200t Review

Vivo X200t Review

Vivo X200T Telugu Review: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వివో’ తన ప్రీమియం సెగ్మెంట్‌లో తాజాగా సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. జైస్‌ పార్టనర్‌షిప్‌తో జనవరి 27న ‘వివో ఎక్స్‌200టీ’ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఫొటోలు, వీడియోలను తీసుకోవడం ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో ఎక్స్‌200టీ రిలీజై ఇప్పటికే వారం దాటింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వారం రోజుల పాటు ఉపయోగించిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇప్పుడు టెక్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిజైన్, డిస్‌ప్లే నుంచి కెమెరా, పర్ఫార్మెన్స్ వరకు ఈ ఫోన్ అనుభవం ఎలా ఉందో ఓ యూసర్ పంచుకున్నాడు.

డిస్‌ప్లే:
వివో ఎక్స్‌200టీ డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అవుట్‌డోర్‌లో బ్రైట్‌నెస్ చాలా బాగుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించడం ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్. కంటెంట్ చూడటం, స్క్రోలింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది.

కెమెరా:
కెమెరాలే ఈ ఫోన్‌కు మెయిన్ హైలైట్. ఫోటోగ్రఫీ విషయంలో మంచి ఆప్టిమైజేషన్ కనిపిస్తోంది. డేలీ ఫోటోలు మాత్రమే కాదు.. వీడియో రికార్డింగ్ కూడా ఈ సెగ్మెంట్‌లో బాగానే ఉంది. కలర్ ట్యూనింగ్, డీటెయిల్స్, స్టెబిలైజేషన్ పరంగా అద్భుతం అనిపిస్తుంది.

పర్ఫార్మెన్స్:
పర్ఫార్మెన్స్ పరంగా ప్రాసెసర్ బాగా ఆప్టిమైజ్ చేయబడింది. గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరమయ్యే గేమ్స్ కూడా స్మూత్‌గా రన్ అవుతున్నాయి. హీటింగ్ లేదా ల్యాగ్ సమస్యలు పెద్దగా కనిపించలేదు. రోజువారీ యూజ్‌తో పాటు గేమింగ్‌కు కూడా ఈ ఫోన్ సరిపోతుంది.

Also Read: Dhurandhar 2: ధురంధర్-2లో డైరెక్టర్ సతీమణి.. టర్నింగ్ పాయింట్‌గా నిలిచే క్యామియో రోల్‌!

బ్యాటరీ:
బ్యాటరీ బ్యాక్‌అప్ డీసెంట్‌గా ఉంది. హెవీ యూజ్‌లో ఒక రోజు వరకు ఉంటుంది. నార్మల్ యూజ్‌లో అయితే బ్యాటరీపై పెద్దగా టెన్షన్ అవసరం లేదు. అయితే ఈ సెగ్మెంట్‌లో ఇంకా కొంచెం మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

సాఫ్ట్‌వేర్:
సాఫ్ట్‌వేర్ అనుభవం విషయానికి వస్తే OriginOS 6 నిజంగా ఒక రిఫ్రెషింగ్ చేంజ్ అని చెప్పాలి. గతంలో ఉన్న FuntouchOS 15తో పోలిస్తే ఇది క్లీనర్ లుక్, స్మూత్ అనిమేషన్స్‌తో మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.

ఆడియో:
ఆడియో విభాగంలో స్పీకర్లు మాత్రం సగటు స్థాయిలోనే ఉన్నాయి. పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా.. డైలీ యూజ్‌కు సరిపోతాయి. ఇక హాప్టిక్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. టైపింగ్, నావిగేషన్ సమయంలో మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాయి.

ఫైనల్లీ:
మొత్తంగా చూస్తే వివో ఎక్స్‌200టీ ఒక ఆల్‌రౌండర్ ప్యాకేజ్‌లా కనిపిస్తోంది. కెమెరా, డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని ప్రాధాన్యం ఇచ్చే యూజర్లకు ఈ ఫోన్ మంచి ఎంపిక.

Exit mobile version