8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- వివో ఎక్స్ ఫోల్డ్ 6 గ్లోబల్ లాంచ్ అక్టోబర్ 1న, భారత్‌లో అక్టోబర్ 6న
- ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 8.02 అంగుళాల ఇంటర్నల్ డిస్ప్లే
- బయట భాగంలో 6.51 అంగుళాల కవర్ డిస్ప్లే
- 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా
- 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ల వైర్డ్, 40 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X Fold 6 Launch: వివో నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6 గ్లోబల్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు వచ్చిన లీక్‌ల ప్రకారం.. అక్టోబర్ 1న ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే.. అంటే అక్టోబర్ 6న భారత మార్కెట్లోకి కూడా తీసుకురానున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ పేర్కొన్నారు.
చైనాలో ఇప్పటికే జూన్ నెలలో Vivo X Fold 6 లాంచ్ అయింది. అక్కడ ఈ ఫోన్ ప్రారంభ ధర CNY 7,999 (రూ.1.05 లక్షలు)గా ఉంది. చైనా లాంచ్ అయ్యాక దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ ఫోల్డబుల్ అడుగుపెట్టనుంది.
Also Read
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
రెండు స్టోరేజ్ వేరియంట్లలో..
గ్లోబల్ మార్కెట్లలో Vivo X Fold 6 రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఈ మొబైల్స్ ప్రిజమ్ బ్లాక్, నెబ్యులా టీల్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. అలాగే సాఫ్ట్వేర్ విషయంలో చైనా, అంతర్జాతీయ వేరియంట్ల మధ్య తేడా ఉండనుంది. చైనాలో విడుదలైన మోడల్ OriginOS 6 Foldతో వచ్చింది. గ్లోబల్ వెర్షన్ మాత్రం OriginOS 7తో వచ్చే అవకాశం ఉంది.
8.02 అంగుళాల భారీ డిస్ప్లే
Vivo X Fold 6లో హార్డ్‌వేర్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇందులో 8.02 అంగుళాల ఇంటర్నల్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్‌లో శామ్సంగ్ M14 లూమినస్ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు సమాచారం. బయట భాగంలో 6.51 అంగుళాల కవర్ డిస్ప్లే ఉండనుంది. పనితీరు కోసం వివో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ను ఇందులో అందించనున్నారు.
200MP కెమెరాతో ఫోల్డబుల్ ఫోన్
కెమెరాల విషయంలోనూ Vivo X Fold 6 అబ్బురపరచనుంది. ఇందులో 200MP ప్రధాన కెమెరా, జీస్ APO సర్టిఫైడ్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. అంతేకాకుండా వివో జీస్ 200mm టెలీకన్వర్టర్ యాక్సెసరీకి కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీంతో మరింత దూరంలోని వస్తువులను జూమ్ చేసి ఫొటోలు తీయవచ్చు.
7,000mAh బ్యాటరీ
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో సాధారణంగా బ్యాటరీ సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. అయితే ఇందులో ఏకంగా 7,000mAh బ్యాటరీ అందించనున్నారు. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
ధర ఎంతంటే?
ఈ ఫోల్డబుల్ మొబైల్ భారత ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే గతంలో వచ్చిన అంచనాల ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ.1.5 లక్షలకు పైగా ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనా మార్కెట్లో X Fold 5తో పోలిస్తే X Fold 6 సిరీస్ ధర సుమారు 40% పెరిగిన నేపథ్యంలో భారత్‌లోనూ ధర ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. గత ఏడాది X Fold 5 చైనాలో విడుదలైన తర్వాత సుమారు ఐదు వారాలకు భారత్‌లోకి వచ్చింది. అయితే ఈసారి గ్లోబల్ లాంచ్ అక్టోబర్ 1న, భారత లాంచ్ అక్టోబర్ 6న జరగనున్నట్లు సమాచారం. వివో నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత భారత్ ధర, వేరియంట్లు, లాంచ్ ఆఫర్లు వంటి వివరాలపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!