100+ స్పోర్ట్స్ మోడ్‌లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!

  • vivo WATCH 6 స్మార్ట్‌వాచ్‌ను వివో చైనాలో అధికారికంగా లాంచ్
  • 1.47 అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 100కు పైగా స్పోర్ట్స్, వర్కౌట్ మోడ్‌లు
  • 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
Vivo Watch 6

Vivo Watch 6

VIVO WATCH 6: వివో నుండి కొత్త వేరబుల్ సెగ్మెంట్‌లో వివో వాచ్ 6 (vivo WATCH 6) స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది హెల్త్ ట్రాకింగ్‌, స్పోర్ట్స్ మోడ్‌లు, eSIM కాలింగ్‌, హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో ప్రీమియం వాచ్‌గా వచ్చింది. ఇందులో 1.47 అంగుళాల AMOLED స్క్రీన్‌ను అందించారు. ఇది 3500 nits పీక్ బ్రైట్‌నెస్‌, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 85.8% స్క్రీన్-టు-బాడీ రేషియోతో అల్ట్రా-నారో బెజెల్స్ ఉన్నాయి. స్క్రీన్‌పై సాఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ ఉంది. టైటానియం వర్షన్‌, స్టెయిన్‌లెస్ స్టీల్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

100+ స్పోర్ట్స్ మోడ్‌లు

ఈ వాచ్‌లో 100కి పైగా వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GNSS సపోర్ట్‌తో ప్రొఫెషనల్ ట్రాకింగ్ అందిస్తుంది. ఇందులో రన్నింగ్ కోచింగ్, AI పేసింగ్, సైక్లింగ్ డేటా ట్రాకింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ గైడెన్స్, 80+ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోర్సులు, హెల్త్ ఫీచర్లు, 60 సెకన్లలో 14 హెల్త్ మెట్రిక్స్ చెక్, హార్ట్ రేట్, SpO2, HRV, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, AFib & పల్ప్ వేవ్ అనాలిసిస్, బ్లడ్ ప్రెజర్ రిస్క్ ఎవాల్యుయేషన్, eSIM + NFC సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. WATCH 6లో eSIM సపోర్ట్ ఉంది. దీంతో ఫోన్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు చేయవచ్చు. WeChat ఇంటిగ్రేషన్‌, NFC పేమెంట్స్ (Alipay, transit cards), కార్ కీలు సపోర్ట్ ఉన్నాయి.

బ్యాటరీ లైఫ్

బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఇందులో లైట్ యూజ్‌లో గరిష్ఠంగా 21 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. రెగ్యులర్ యూజ్‌లో 10 రోజులు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్‌లో ఉంటే 6 రోజులు, eSIM మోడ్‌లో 4 రోజుల వరకు పనిచేస్తుంది. వాచ్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

ధరలు

* బ్లూటూత్ వర్షన్: 999 యువాన్‌ (సుమారు రూ.14,295)
* eSIM (స్టీల్): 1399 యువాన్‌ (సుమారు రూ.20,020)
* eSIM (టైటానియం): 1999 యువాన్‌ (సుమారు రూ.28,605)

వివో బడ్స్ క్లిప్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, vivo WATCH 6 సెప్టెంబర్ 28 నుంచి సేల్‌కు వస్తుంది.