Site icon NTV Telugu

AMOLED డిస్‌ప్లే, Zeiss ట్యూన్ కెమెరా, 90W ఫాస్ట్ ఛార్జింగ్తో Vivo V70, Vivo V70 Elite విడుదల..

Vivo

Vivo

Vivo V70, V70 Elite: వివో తన తదుపరి తరం V-సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వచ్చిన లీక్స్ ప్రకారం.. Vivo V70 సిరీస్ ఫిబ్రవరి మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో మొదటగా Vivo V70, Vivo V70 Elite మోడల్స్ ను కంపెనీ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: BMC Election Results: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? పూర్తి రిపోర్టు ఇదే..

ప్రీమియం సెగ్మెంట్‌లోకి వివో..
అయితే, V70 సిరీస్‌తో Vivo తన V-లైన్‌ను మరింత ప్రీమియం సెగ్మెంట్ వైపు తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్టాండర్డ్ V70 స్టైలిష్ డిజైన్, మెరుగైన కెమెరాలు, సమతుల్య పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. V70 Elite మాత్రం V-సిరీస్, X-సిరీస్ మధ్య గీతను మసకబార్చేలా కనిపిస్తోంది. కాగా, వివో నుంచి అధికారిక ప్రకటన తర్వాత మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. V70 సిరీస్ కొనుగోలు చేయాలనుకునే వారు లాంచ్ తర్వాత పూర్తి రివ్యూలు చూసి నిర్ణయం తీసుకోవడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Vivo V70, V70 Elite ధరలు..
* Vivo V70 ధర రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ఉండే అవకాశం..
* Vivo V70 Elite ధర రూ.50,000 నుంచి రూ.55,000 వరకు ఉండొచ్చని అంచనా

Read Also: BMC Elections: 25 ఏళ్ల శివసేన పాలనకు బ్రేక్.. ఠాక్రే సోదరుల పతనాకి కారణాలు ఇవే..

Vivo V70 ఫీచర్లు..
* స్టాండర్డ్ Vivo V70
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్
* Zeiss ట్యూన్ చేసిన కెమెరాలపై ప్రత్యేక ఫోకస్
* హై రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లే
* ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద బ్యాటరీ
* గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లు

Vivo V70 Eliteపై ప్రత్యేక ఆసక్తి
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్
* హై-ఎండ్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌కు చెందిన చిప్‌సెట్
* 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* 50MP మెయిన్ కెమెరా
* 50MP టెలిఫోటో లెన్స్
* 8MP అల్ట్రా వైడ్ కెమెరా
* 6,500mAh బ్యాటరీ
* 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫీచర్లే భారతీయ మార్కెట్‌లో V70 Eliteకి కూడా వచ్చే అవకాశం ఉంది. అదనంగా, కొత్త బ్రౌన్ కలర్ ఆప్షన్లో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని సమాచారం.

Exit mobile version