9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

Vivot5

Vivot5

Vivo T5 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్లో తన సరికొత్త ‘T’ సిరీస్ ఫోన్ Vivo T5 Pro 5G లాంచ్‌కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక టీజర్లు, ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మైక్రోసైట్ ఇప్పటికే ప్రత్యక్షమయ్యాయి. బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను అందించే దిశగా ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకవస్తుంది.

Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

×
×
Ad

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 9,020mAh భారీ బ్యాటరీ. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, తన సెగ్మెంట్లోనే అత్యంత సన్నని (Slimmest) ఫోన్‌ గా ఇది నిలుస్తుందని వివో పేర్కొంటోంది. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ విషయంలో తిరుగుండదని చెప్పవచ్చు. అలాగే గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్ 120FPS గేమింగ్‌ను సపోర్ట్ చేయడం విశేషం.

ఫ్లిప్‌కార్ట్ లోని టీజర్ల ప్రకారం ఈ ఫోన్ వెనుక భాగంలో పిల్‌-షేప్ (Pill-shaped) మాడ్యూల్‌ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సాధారణ ఫోన్లకు భిన్నంగా, ఇందులో పవర్, వాల్యూమ్ బటన్లు ఎడమ వైపున ఉన్నాయి. కింద భాగంలో USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే అమర్చారు. అంతేకాకుండా, ఫొటోగ్రఫీ కోసం విడివిడిగా కొనుగోలు చేయగల ‘ఎక్స్‌టెండర్ కిట్’ (Extender Kit)ను కూడా వివో పరిచయం చేయబోతోంది.

Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ, లీకైన సమాచారం ప్రకారం 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే (1.5K రిజల్యూషన్, 144Hz రీఫ్రెష్ రేట్), స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 సాఫ్ట్‌వేర్, IP68+IP69 (ధూళి మరియు నీటి నుంచి రక్షణ) ప్రొటెక్షన్ కలిగిఉంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం ధర 15 – 20 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.