Upcoming Smartphones: ఈ వారం భారత టెక్ మార్కెట్ లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ, రియల్ మీ, ఇన్ఫినిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ వారం సరికొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి డిజైన్‌తో పాటు బ్యాటరీ, పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాయి. బడ్జెట్ 5G నుంచి ఫ్లాగ్‌షిప్ వరకు అన్ని సెగ్మెంట్లలో కొత్త ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ ఫోన్స్ ఏవో చూసేద్దామా..
iQOO Neo 11:
గేమింగ్ యూజర్ల కోసం iQOO Neo 11 ప్రత్యేకంగా వస్తోంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 వంటి శక్తివంతమైన ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఇందులో 120Hz AMOLED డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌తో హై-ఎండ్ గేమింగ్‌కు అనువుగా ఉంటుంది.
Leon Panetta: బిన్ లాడెన్ వేటగాడు మాజీ సీఐఏ అధికారి.. ట్రంప్‌కు హోర్ముజ్‌పై కీలక సూచనలు
OnePlus 15T:
OnePlus 15T మార్చి 24న లాంచ్ కానుంది. చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ ఫ్లాగ్‌షిప్ పనితీరును అందించేలా ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ చిప్, OxygenOS 16 వంటి ఫీచర్లు ఉండొచ్చు. చిన్న ఫోన్ (కాంపాక్ట్ సైజు) అయినప్పటికీ పెద్ద బ్యాటరీతో వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం డిజైన్, కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఆకర్షణగా నిలవనున్నాయి.
Samsung Galaxy A57 5G:
Samsung Galaxy A57 5G మార్చి 25న లాంచ్ కానుంది. ఇందులో Exynos 1680 ప్రాసెసర్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న సూపర్ AMOLED డిస్‌ప్లే ఉండనుంది. అలాగే ఇందులో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. ముఖ్యంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందే అవకాశం ఉండటంతో దీర్ఘకాల వినియోగానికి ఇది బెస్ట్ ఆప్షన్.
CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం
Samsung Galaxy A37 5G:
Samsung Galaxy A37 5G కూడా మార్చి 24న రోజున లాంచ్ కానుంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. Exynos 1480 ప్రాసెసర్, 6.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో ఇది రోజంతా సాఫీగా పని చేసే అవకాశం ఉంది. ఇంకా దీర్ఘకాల అప్‌డేట్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.
Infinix Note 60 Pro:
Infinix Note 60 Pro ఈ వారం భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6000mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీ ఉండొచ్చు. పెద్ద స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.
