Unix India: యూనిక్స్ ఇండియా (Unix India) తమ క్లాసిక్ ఎడిషన్ శ్రేణిలో భాగంగా రెండు కొత్త బ్లూటూత్ స్పీకర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. Capri 52 (XB-U88), Pontiac 34 (XB-U77) అనే ఈ కొత్త మోడల్స్ వింటేజ్ కార్ల ప్రత్యేక డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ రెండు స్పీకర్లు 10W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.
7500mAh బ్యాటరీ, 144Hz OLED డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5 తో REDMAGIC 11 Pro లాంచ్..!
ఈ స్పీకర్లలో డ్యూయల్ 5W డ్రైవర్లు ఉండగా.. ఇవి శక్తివంతమైన, స్పష్టమైన సౌండ్ ను అందిస్తాయి. అలాగే ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) సపోర్ట్ ద్వారా వినియోగదారులు రెండు స్పీకర్లను జత చేసి స్టీరియో సౌండ్ అనుభవాన్ని పొందవచ్చు. ఇక రెట్రో థీమ్‌కు తగ్గట్టు LED హెడ్‌లైట్‌లు, క్లాసిక్ డిజైన్ అంశాలు వీటికి ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే రెండూ మోడల్స్ 1500mAh బ్యాటరీతో వస్తాయి. వీటిని టైప్-C పోర్ట్ ద్వారా సుమారు 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత సుమారు 6 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్పీకర్లు బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో సులభంగా కనెక్ట్ అవుతాయి. వీటి వైర్‌లెస్ రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుంది.
Australia Squad: భారత్ టీ20 సిరీస్ నుంచి ట్రవిస్ హెడ్ ఔట్.. కారణం అదేనా?
Pontiac 34 (XB-U77) మోడల్‌లో TF కార్డ్, USB, AUX ఇన్‌పుట్ ఎంపికలు ఉన్నాయి. అలాగే ఇవి హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. Capri 52 (XB-U88) మోడల్‌లో ఇంకా FM రేడియో, AUX, USB, TF కార్డ్, బ్లూటూత్ ప్లేబ్యాక్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇది కూడా హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, Capri 52, Pontiac 34 స్పీకర్లు రెండూ రూ. 2,499 ధరకు అందుబాటులో ఉన్నాయి. Capri 52 మోడల్ నలుపు, తెలుపు, నీలం, ఎరుపు రంగుల్లో లభిస్తుండగా.. Pontiac 34 మాత్రం మోడల్ డ్యూయల్ టోన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ రెండు స్పీకర్లు యూనిక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్ లలో కొనుగోలుకు లభిస్తున్నాయి.

Image