Twitter: ఇక ఆ టెన్షన్ లేదు.. ట్విట్టర్‌లో భారీ మార్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారా..? ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారా..? అయితే, అక్షరాల పరిమితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా..? అయితే, ఇక, నో టెన్షన్.. ఎందకంటే సోషల్‌మీడియా దిగ్గజం ట్విట్టర్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ వస్తున్న ట్విట్టర్.. ఇప్పుడు ట్వీట్ ఎడిట్ ఫీచర్‌ను టెస్టింగ్‌లో పెట్టింది.. అంతే కాదు.. మరో ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటి వరకు కేవలం 280 అక్షరాలతోనే ట్వీట్ చేసే అవకాశం ఉండగా.. అక్షరాలు పెరిగితే.. మరో ట్వీట్‌ను జోడించాల్సిన పరిస్థితి ఉండేది.. కానీ, ఇప్పుడు అక్షరాల పరిమితిని 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాలనే ప్లాన్‌లో ఉంది సోషల్ మీడియా దిగ్గజం.
Read Also: Another Atrocity In Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. 17 ఏళ్ల బాలికపై..!
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
ఇక, ట్విట్టర్ అక్షరాల పరిమితి కోసం నోట్స్ పేరిట కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది… ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. అంటే, సుదీర్ఘమైన ట్విట్ చేయొచ్చు అన్నమాట.. అంతేకాదు.. ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్‌ఎస్ వంటివి కూడా జోడించే వెసులుబాటు తీసుకొస్తుంది. ట్వీట్ చేసే ముందు ప్రివ్యూకు కూడా అవకాశం ఇస్తున్నారు.. అమెరికా, యూకే, కెనడా లాంటి దేశాల్లో ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు.. ప్రస్తుతం చిన్న సమూహంతో క్లోజ్డ్ టెస్ట్‌ని నడుపుతున్నాం. వారు ట్విట్టర్‌లో వ్రాయడానికి వచ్చిన వ్యక్తులకు ఎలా ఉత్తమ సేవలు అందించాలో తెలుసుకోవడానికి మాకు సహాయపడతారు.. అని ట్విట్టర్ పేర్కొంది.. వాస్తవానికి, మొదట ట్వీట్ అక్షరాల పరిమిత 140 మాత్రమే.. 2017లో ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచారు.. త్వరలోనే అది 2500 అక్షరాలకు చేరుకోబోతంది.. కాగా, ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే వ్యవహారం మధ్యలోనే ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!