Site icon NTV Telugu

Twitter: యూట్యూబ్ లాగే ‘ట్విట్టర్ వీడియో యాప్’.. మస్క్ కీలక ప్రకటన..

Elon Musk

Elon Musk

Twitter: దాదాపుగా గత రెండు దశాబ్ధాలుగా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ లో యూట్యూబ్ తన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. 2005లో ప్రారంభం అయిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు, సినిమా, గేమింగ్ లవర్స్ కి కంటెంట్ అందిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ వీడియో యాప్ స్మార్ట్ టీవీల కోసం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా సేమ్ ఇలాంటి ఆలోచనతో రాబోతున్నారు. ట్విట్టర్ నుంచి స్మార్ట్ టీవీల కోసం వీడియో యాప్ రాబోతున్నట్లు మస్క్ ప్రకటించారు.

Read Also: Mutton Pulao : మటన్ పులావ్ ను ఇలా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో..

ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ యూజర్లలో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ‘ట్విట్టర్ వీడియో యాప్’ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఫోన్లలో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూడటం సాధ్యం కానందున స్మార్ట్ టీవల కోసం ట్విట్టర్ వీడియో యాప్ అవసరం అని ట్విట్టర్ యూజర్లు చెప్పిన సమయంలో మస్క్ స్పందిస్తూ.. ‘ వస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. మాకు స్మార్ట్ టీవీ కోసం ట్విట్టర్ వీడియో యాప్ అవసరం అని.. ట్విట్టర్ లో నేను గంట నిడివి ఉన్న వీడియోలు చూడటం లేదని ఓ యూజర్ల మస్క్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో మస్క్ ‘ ఇట్స్ కమింగ్’ అని చెప్పాడు. దీంటో ట్విట్టర్ యూజర్ల అభినందనలు తెలియజేశారు.

Twitter

గత నెలలో ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో 2 గంటల వరకు వీడియోలను అప్‌లోడ్ చేయడానికి అనుమతించింది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే, ప్రజలు మైక్రో బ్లాగింగ్ సైట్‌లో ఫిల్మ్‌లను అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. జాన్ విక్ చాప్టర్ 4 కూడా విడుదలైన కొద్ది రోజులకే ట్విట్టర్‌లో లీక్ అయింది. రానున్న కాలంలో యూజర్లు యాప్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు చూడగలిగే అవకాశం ఉంటుందని, పెద్ద వీడియోలను 15 సెకండ్ల ఫార్వర్డ్, బ్యాక్ సీక్ బటన్ ఆఫ్షన్లు కూడా ఉంటాయని మస్క్ ప్రకటించారు.

Exit mobile version