Site icon NTV Telugu

TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్ షాక్.. రూ.150 కోట్లు ఫైన్!

Trai

Trai

TRAI: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రూ.150 కోట్ల జరిమానా విధించింది. ఈ రూ.150 కోట్ల జరిమానా 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్పింది. జరిమానాకు ప్రధాన కారణం స్పామ్ కాల్స్, సందేశాలను ఆపడంలో టెలికాం కంపెనీలు విఫలమవడం, వినియోగదారుల ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోవడం అని ట్రాయ్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. టెలికాం కంపెనీలు TRAI విధించిన ఈ జరిమానాను సవాలు చేసినట్లు సమాచారం.

READ ALSO: Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..!

నిబంధనలను పాటించని టెలికాం ఆపరేటర్లపై TRAI జరిమానాలు విధించింది. గత సంవత్సరం TRAI 2.1 మిలియన్ల స్పామర్‌లను డిస్‌కనెక్ట్ చేసింది, 100,000 కంటే ఎక్కువ మందిని బ్లాక్ చేసింది. సెప్టెంబర్ 2024లో TRAI 1.88 మిలియన్ల స్పామర్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసి, 1,150 మందిని బ్లాక్‌లిస్ట్ చేసింది. పలు నివేదికల ప్రకారం.. టెలికాం ఆపరేటర్లపై TRAI ఈ జరిమానా విధించిందని, స్పామ్ కాల్‌లు లేదా సందేశాలు పంపినవారిపై కంపెనీలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఈ జరిమానా విధించిందని పేర్కొంది. స్పామ్ కాల్స్, సందేశాలను నియంత్రించడంలో వినియోగదారుల ఫిర్యాదులు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అనేక వినియోగదారుల ఫిర్యాదులను తప్పుగా మూసివేసినట్లు ట్రాయ్ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కంపెనీలకు ట్రాయ్ జరిమానా విధించినట్లు పేర్కొంది. ఇదే టైంలో TRAI ఒక DND యాప్‌ను కూడా ప్రారంభించింది. ఇది వినియోగదారులు ఏదైనా స్పామ్ కాల్ లేదా సందేశాన్ని నివేదించడానికి అనుమతిస్తుంది.

READ ALSO: Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!

Exit mobile version