Moto G14: మోటోరోలా స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ధర రూ.9,999 మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto G14: Motorola భారతీయ మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటో నుంచి మరో కొత్త మొబైల్ తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది. ఇప్పటికి మన దేశంలో ఒకే ఒక వేరియంట్ లాంచ్ చేసింది. ఇది 4GB+128GB స్టోరేజ్‌తో కూడా వస్తుంది. దీని ధర రూ.9,999 మాత్రమే. Moto G14 స్మార్ట్‌ఫోన్ స్టీల్ గ్రే మరియు స్కై బ్లూ రంగులలో లభిస్తుంది. రానున్న రోజుల్లో మరికొన్ని రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు మోటరోలా కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
ICICI కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు..
Moto G14 స్మార్ట్‌ఫోన్ మన దేశంలో ఆగస్టు 8, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ మరియు రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G14 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ.750 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్ రూ.9249కి వస్తుంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Read also: దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
హెచ్‌డీ డిస్‌ప్లే..
Moto G13 తర్వాత వచ్చిన మోటో జీ14 ఫ్లాట్ ప్రైమ్ డిజైన్‌లో ఉంటుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది. ఇది 405ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఈ LCD డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Motorola 4GB LPDDR4X RAMతో వచ్చే హ్యాండ్‌సెట్‌లో Mali-G57 MP1 GPUని కూడా అందించింది. Moto G14 స్మార్ట్‌ఫోన్ Octacore Unisock T616 SoCతో మరింత శక్తివంతమైనది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MyUXతో రన్ అవుతున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.
కెమెరా నాణ్యత..
Moto G14 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ప్యానెల్‌లో క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF), f/1.8 ఎపర్చర్‌తో కూడిన కెమెరాతో వస్తుంది. Motorola సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం f/2.4 ఎపర్చర్‌తో ముందు వైపు 2-మెగాపిక్సెల్ మైక్రో కెమెరాను కూడా అందించింది. ఫోన్‌లో 128GB UF S2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌తో ఈ నిల్వను 1TB వరకు విస్తరించవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం
Moto G14 స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ బాక్స్‌లో ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. Moto G14లో నెట్‌వర్క్ కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వైఫై, GPS, A-GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ IP52 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ ప్రూప్ కొంతమేరకు ఉంటుంది. ఈ ఫోన్ బరువు 177 గ్రాములు ఉంటుంది.
Indrakaran Reddy: ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారు..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!