Site icon NTV Telugu

Tecno Spark Go 5G: కేవలం రూ.9,999లకే 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Tecno Spark Go 5g

Tecno Spark Go 5g

Tecno Spark Go 5G: టెక్నో (Tecno) సంస్థ నేడు (ఆగష్టు 14)న భారతదేశంలో టెక్నో స్పార్క్ గో 5G (Tecno Spark Go 5G) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌తో వస్తూ, 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. తన సెగ్మెంట్‌లో అత్యంత సన్నని మరియు తేలికైన 5G ఫోన్ గా కంపెనీ దీన్ని పరిచయం చేసింది. కేవలం 4GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్‌లో లభించే ఈ ఫోన్ 50MP AI ఆధారిత ప్రైమరీ కెమెరా, Ella AI వాయిస్ అసిస్టెంట్, అలాగే No Network Communication ఫీచర్లను అందిస్తోంది. కంపెనీ ప్రకారం ఈ మొబైల్ ఐదు సంవత్సరాలపాటు ల్యాగ్ ఫ్రీ పనితీరును అందించనుంది.

భారతదేశంలో Tecno Spark Go 5G మొబైల్ ను రూ.9,999 గా నిర్ణయించబడింది. ఈ మొబైల్ ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లి మొబైల్ ఇంక్ బ్లాక్, స్కై బ్లూ, టుర్కవోయిస్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.

Realme P4 Pro 5G: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 4K వీడియో సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్న రియల్‌మీ P4 5G సిరీస్!

ఈ ఫోన్‌లో 6.76 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (720×1,600 పిక్సెల్స్)తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఆక్టా-కోర్ MediaTek Dimensity 6400 చిప్‌సెట్, 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది Android 15-ఆధారిత HiOS పై నడుస్తుంది.

ఇక AI ఫీచర్లలో Ella AI అసిస్టెంట్ ఉంది. ఇది హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, బెంగాలీ వంటి భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అదనంగా AI Writing అసిస్టెంట్, Google సంబంధిత Circle to Search టూల్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరా విభాగంలో, 50MP AI ప్రైమరీ రియర్ కెమెరా, LED ఫ్లాష్, అలాగే 5MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. రియర్ కెమెరా 2K వీడియో రికార్డింగ్ @ 30fps సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ తన సెగ్మెంట్‌లో మొదటిసారి 4X4 MIMO టెక్నాలజీని అందిస్తోంది. ఇది నాలుగు యాంటెన్నాలను ఉపయోగించి ఒకేసారి డేటాను పంపడం, స్వీకరించడం ద్వారా నెట్‌వర్క్ వేగాన్ని 73% వరకు పెంచుతుంది. అంతేకాకుండా No Network Communication ఫీచర్‌తో సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది.

Vivo T4 Pro: మరో సంచలనానికి తెరలేపిన వివో.. డిజైన్, కెమెరా, ప్రాసెసర్ అప్‌గ్రేడ్స్‌తో రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్!

ఈ కొత్త టెక్నో స్పార్క్ గో 5G 6,000mAh సామర్థ్యమున్న భారీ బ్యాటరీతో వస్తోంది. దీని వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం ఉపయోగించుకోవచ్చు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. కాబట్టి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఇది మరింత సురక్షితంగా ఉంటుంది.

ఇక కనెక్టివిటీ పరంగా 5G, 4G, Bluetooth, Wi-Fi, GPS, USB Type-C పోర్ట్, అలాగే IR బ్లాస్టర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. డిజైన్ విషయానికొస్తే ఈ ఫోన్ మందం కేవలం 7.99మి.మీ. కాగా, బరువు 194 గ్రాములు మాత్రమే. అందువల్ల ఇది తేలికగా, సులభంగా పట్టుకునేలా ఉంటుంది. మొత్తంగా ఈ Tecno Spark Go 5G తన ఆకర్షణీయమైన ధర, భారీ బ్యాటరీ, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో బలమైన పోటీని ఇవ్వనుంది.

Exit mobile version