Site icon NTV Telugu

POVA Curve 2 5G: 8000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్.. బడ్జెట్ తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!

Pova Curve 2 5g

Pova Curve 2 5g

‘టెక్నో’ నుంచి మరో ఆసక్తికరమైన 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రానుంది. మే 2025లో విడుదలైన పోవా కర్వ్ 5G (Tecno Pova Curve)కి కొనసాగింపుగా టెక్నో పోవా కర్వ్ 2 (Tecno Pova Curve 2 5G)ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌గా ఉంటుందా? లేక సాఫ్ట్ లాంచ్‌కే పరిమితమవుతుందా? అన్నదానిపై టెక్నో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ గ్రాండ్ లాంచ్ నిర్వహిస్తే, టెక్నో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది. లాంచ్‌కు ముందు నుంచే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన పలు కీలక వివరాలను లీక్ చేయడంతో టెక్ ప్రియుల్లో అంచనాలు పెరిగాయి.

పోవా కర్వ్ 2 ధరకు టెక్నో ఇప్పటివరకు అధికారిక ధరను వెల్లడించలేదు. అయితే లీకులు ప్రకారం.. రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో వచ్చిన Pova Curve 5G రూ.15,999 (6GB RAM + 128GB) నుంచి ప్రారంభమైంది. అదే ధర శ్రేణిని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో Space 2.0 డిజైన్ లాంగ్వేజ్ అందించారు. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో కూడిన ఈ ఫోన్ వెనుక భాగంలో కర్వ్‌డ్‌, మ్యాట్ ఫినిష్ రియర్ ప్యానల్‌ను కలిగి ఉంది. కొత్తగా త్రిభుజాకార (ట్రయాంగ్యులర్), అసిమెట్రిక్ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో చిన్న LED ఫ్లాష్, పోవా బ్రాండింగ్ కనిపిస్తాయి. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, వైలెట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో రానుంది.

మునుపటి మోడల్‌ లాగే పోవా కర్వ్ 2లో కూడా కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉండనుంది. కంపెనీ ‘గిల్ట్-ఫ్రీ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్’ అని టీజ్ చేయడం ద్వారా హై రిఫ్రెష్ రేట్‌కు సంకేతమిచ్చింది. లీకుల ప్రకారం ఇందులో 6.78 అంగుళాల కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ఉండొచ్చు. గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు వచ్చే అవకాశముంది. HiOS ఆధారిత Androidపై నడవనుంది. Android 15 లేదా Android 16లో ఏదీ ఉంటుందన్నది ఇంకా స్పష్టత లేదు.

Also Read: Mohsin Naqvi Trolls: ఒకటే తరహా ప్రకటనలు, పదే పదే యూ టర్న్‌లు.. ‘సీవీ’ అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్!

ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. రెండు లెన్స్‌లు ఒకే హారిజాంటల్ మాడ్యూల్‌లో, మూడో లెన్స్ వేరు రింగ్‌లో ఉంటుంది. లీకుల ప్రకారం ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. గత మోడల్లో 64MP Sony IMX682 సెన్సర్‌తో డ్యుయల్ కెమెరా ఉండేది. ఈ ఫోన్‌లో 8000mAh భారీ బ్యాటరీ అందించనున్నారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. ఈ బ్యాటరీతో రోజుల తరబడి ఉపయోగించవచ్చు. మొత్తంగా చూస్తే Tecno Pova Curve 2 డిజైన్, భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version