భారత్‌లో Tecno Camon 19 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?

Tecno Camon 19 Pro 5g

Tecno Camon 19 Pro 5g

భారత్‌లో Tecno Camon 19 Pro 5G బుధవారం లాంచ్ చేయబడింది. ఇది 64-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. చీకట్లో కూడా ఫొటోలు తీసుకునేందుకు వీలుగా కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (HIS)ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యాంతో రాగా.. మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌ని ఉపయోగించి 5GB వరకు పొడిగించే ఎంపికను కలిగి ఉంది.

CJI: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకం

భారత్‌లో Tecno Camon 19 Pro 5G( 8జీబీ ర్యాం + 128జీబీ స్టోరేజ్) వేరియంట్‌ కోసం రూ.21,999గా నిర్ధారించపడింది. ఇది సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఆగస్టు 12 నుండి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. గేమింగ్ కోసం Mali-G57 GPUతో MediaTek HyperEngine 2.0తో కూడా వస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం, Tecno Camon 19 Pro 5G ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ప్రధాన కెమెరా 64మెగాపిక్సెల్‌ కాగా.. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 128జీబీ స్టోరేజీ ఉండగా.. దానిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు. స్మార్ట్‌ఫోన్ 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది.