స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి.. అందులోను వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. అందుకే మెటా కంపెనీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి కంపెనీలను విలీనం చేసుకుంది. అంతేకాదు యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ స్టేటస్ షేరింగ్ గురించి అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది..
వాట్సాప్ మెసేజ్ లను, ఫొటోలు, వీడియోల షేరింగ్ విషయంలో భారీ మార్పులను తీసుకొచ్చేస్తోంది. తాజాగా వాట్సాప్ స్టేటస్‌లో ఉండే షేరింగ్ ఆప్షన్‌ను మరింత సులభతరం చేస్తోంది.. అలాగే ఇతర వాటితో స్టేటస్‌లను షేర్ చేసుకునేందుకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.. ప్రస్తుతానికి ఇంస్టాగ్రామ్, వేరే రీల్స్ వీడియోల ను ఫేస్ బుక్ లో డైరెక్ట్ పోస్ట్ చెయ్యడానికి ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే విధంగా తాజాగా తమ వాట్సాప్ స్టోరీని లింక్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునేందుకు యూజర్లకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు సమాచారం… ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్ ను కూడా మార్చాల్సి ఉంటుంది..
వాట్సాప్ నుంచి ఫేస్ బుక్ కు ఎలా మార్చాలి అంటే..
*. మీరు ఏదైనా స్టోరీని షేర్ చేశాక ఫేస్‌బుక్ స్టోరీకి షేర్ స్టేటస్ ఎనేబుల్ చేసుకునేందుకు ఒక సెటప్ ఆప్షన్ కనిపించనుంది. అప్పుడు మీకు కావాల్సిన దానిని ఎంపిక చేసుకోవచ్చు…
*. అక్కడ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ స్టేటస్ లు డైరెక్ట్ ఫేస్ బుక్ లో షేర్ అవుతాయి..
*. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు..
అయితే వాట్సాప్ తన యూజర్లకు వారి షేర్డ్ స్టేటస్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా కాపాడుతుంది. యూజర్లు తమ స్టేటస్‌ను ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనే విషయాన్ని కూడా ఎంచుకొనే అవకాశం ఉంది.. ఫ్యూచర్ లో మరి కొన్ని బెటర్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం…