వైర్‌లెస్ స్పీకర్లలో స్మార్ట్ ఆడియో సెటప్.. కొత్త TCL Z100 లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCL Z100: TCL తన కొత్త Z100 వైర్‌లెస్ హోమ్ థియేటర స్పీకర్ సిస్టమ్ ను అమెరికా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది దేశంలో Dolby Atmos FlexConnect టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి సిస్టమ్‌గా గుర్తింపు పొందింది. ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు స్పీకర్లను గది లోపల ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అయినా సరే, సౌండ్ అనుభవం మాత్రం సమానంగా, స్పేషియల్ ఎఫెక్ట్ తో అద్భుతంగా వినిపిస్తుంది.
California: 64ఏళ్ల ఉపాధ్యాయుడికి 215 సంవత్సరాల జైలు శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Also Read
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
- POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
- Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
TCL Z100 సిరీస్‌ను 2025లో కంపెనీ లాంచ్ చేసిన QD-Mini LED TVలతో సులభంగా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఒక స్పీకర్ ధర 399.99 డాల్లర్స్(రూ.35,100) గా ఉంది. బండిల్ ఆఫర్లలో కూడా ఇది లభిస్తుంది. ప్రస్తుతం అమెరికాలోని ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే భారత మార్కెట్లోకి వస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, Dolby Atmos FlexConnect వల్ల గది డిజైన్, స్పీకర్ అమరిక, కనెక్ట్ చేసిన పరికరాల ఆధారంగా ఆటోమేటిక్‌గా సౌండ్ సెట్ అవుతుంది. అవసరమైతే వినియోగదారులు అదనపు స్పీకర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.
50MP+50MP+32MP కెమెరాలు, 6,500mAh భారీ బ్యాటరీతో వచ్చేసిన Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్!
సౌండ్ క్వాలిటీ కోసం TCL కొత్త డిజైన్‌ను తీసుకువచ్చింది. NdFeB రేర్ ఎర్త్ మాగ్నెట్స్, సిల్క్-డోమ్ ట్వీటర్స్, టైట్‌గా చుట్టబడిన అయిన వాయిస్ కాయిల్స్ ను ఉపయోగించారు. ఇది 170W RMS అవుట్‌పుట్ ఇస్తుంది. వీటితోపాటు TCL సంబంధించిన QM8K, QM7K, QM6K QD-Mini LED టీవీలతో ఈ సౌండ్ సిస్టమ్ అనుకూలంగా పనిచేస్తుంది. మొత్తంగా ఈ TCL Z100 వైర్‌లెస్ హోమ్ థియేటర్ సిస్టమ్ సౌండ్ క్వాలిటీ, ఫ్లెక్సిబుల్ స్పీకర్ సెటప్, ఆధునిక టెక్నాలజీతో వినియోగదారులకు మంచి ఆడియో అనుభవాన్ని అందించబోతోంది.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!