ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ ‘స్టార్‌లింక్’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తోంది. ఈ స్టార్‌లింక్ సేవలు త్వరలో భారతదేశంలో ఆరంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తన Xలో పోస్ట్ ద్వారా తెలిపారు. సిందియా చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. స్టార్‌లింక్‌తో భారత్‌కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు.
స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రైయర్ న్యూఢిల్లీలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమయ్యారు. ‘స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గారిని, సీనియర్ లీడర్‌షిప్ టీమ్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత యాక్సెస్‌ను అభివృద్ధి చేసే అంశంపై చర్చించాము. ప్రధాని మోడీ గారు దేశాన్ని డిజిటల్‌గా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ శాటిలైట్ సాంకేతికత భారత్‌లోలోని సుదూర ప్రాంతాలకు కనెక్టివిటీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రతి పౌరుడికి మెరుగైన ఇంటర్నెట్ యాక్సెస్ అందించడంలో ఇది సహాయపడుతుంది. ఈ ఉపగ్రహ సాంకేతికత డిజిటల్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది’ అని సింధియాతో పేర్కున్నారు.
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సిందియా చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. స్టార్‌లింక్‌తో భారత్‌కు సేవ చేసేందుకు తాను ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో స్టార్‌లింక్ బృందం చర్చలు జరుపుతోంది. స్టార్‌లింక్ భారత్‌లో అడుగుపెట్టేందుకు దాదాపుగా రంగం సిద్ధం అయింది. త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. స్టార్‌లింక్‌కు చివరి దశ అనుమతి రావాల్సి ఉంది. ఇటీవలే భారతదేశానికి చెందిన స్టార్‌లింక్ వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది. అది నకిలీ వెబ్‌సైట్ అని లారెన్ డ్రైయర్ స్పష్టం చేశారు. సాంకేతిక లోపం కారణంగా లైవ్ అయిందని చెప్పి.. వెబ్‌సైట్‌ను తొలగించారు.
Also Read: Kohli-Rohit-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
స్టార్‌లింక్ ఇంకా భారతీయ ధరలను ప్రకటించలేదు. కానీ అమెరికాలోని న్యూజెర్సీలో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు US$80 (సుమారు రూ.7,000)గా ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 250Mbps ఇంటర్నెట్ వేగాన్ని పొందుతారు. స్టార్‌లింక్ అనేది ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవ. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. దేశంలో ఇప్పటికీ సరైన బ్రాడ్‌బ్యాండ్ సేవ లేని లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ కేబుల్ లైన్లు అంతరాయం కలిగించే అనేక ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో స్టార్‌లింక్ చాలా ఉపయోగకరంగా ఉండనుంది. స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇది భూమికి దాదాపు 550–600 కిమీ ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌లింక్‌కు చెందిన 6,000 ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండడంతో ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించొచ్చు.
