Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్

  • త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII
  • మే 13, 2026న లాంచ్
  • మేజర్ రీడిజైన్, బెటర్ కెమెరా సెన్సార్లు, AI ఫీచర్లు
Sony Xperia 1 Viii

Sony Xperia 1 Viii

సోనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించనుంది. Xperia 1 VIII అనే పేరుతో తన 2026 ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్‌ను మే 13, 2026న లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్ జపాన్ సమయం ప్రకారం ఉదయం 11 గంటలకు (IST ప్రకారం ఉదయం 7:30) జరుగుతుంది. YouTube ద్వారా లైవ్ స్ట్రీమ్ అవుతుంది. సోనీ Xperia సిరీస్ ఎప్పుడూ కెమెరా ఎంథ్యూజియాస్టులు, ఆడియో లవర్స్ (హెడ్‌ఫోన్ జాక్), స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సారి మేజర్ రీడిజైన్, బెటర్ కెమెరా సెన్సార్లు, AI ఫీచర్లు, శక్తివంతమైన చిప్‌సెట్‌తో సోనీ తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తోంది.

ప్రధాన ఫీచర్లు & డిజైన్ మార్పులు

గత మోడల్‌ల నుంచి గణనీయమైన డిజైన్ మార్పులు ఈ ఫోన్‌లో కనిపిస్తాయి:. రియర్ కెమెరా.. సాంప్రదాయిక నిలువు కెమెరా స్ట్రిప్‌కు బదులుగా స్క్వేర్ కెమెరా ఐలాండ్ డిజైన్. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

డిస్‌ప్లే: 6.5-ఇంచ్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌తో ఫ్లాట్ ప్యానెల్.
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ (శక్తివంతమైన పనితీరు కోసం).
కెమెరా: ట్రిపుల్ 48MP సెన్సార్లు (మెయిన్ + అల్ట్రావైడ్ + టెలిఫోటో/పెరిస్కోప్) ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కొత్త టెలిఫోటో లెన్స్‌తో మెరుగైన జూమ్ సామర్థ్యం. “Xperia AI” ఫీచర్లు కూడా ఉంటాయి.
ఇతర ఫీచర్లు: 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రోSD కార్డ్ స్లాట్ (అంచనాలు), దీర్ఘకాలిక బ్యాటరీ (2 రోజులు వరకు), డ్యూయల్ సిమ్ సపోర్ట్.
డైమెన్షన్స్: సుమారు 161.9 x 74.4 x 8.58 mm (కొంచెం మందంగా ఉండవచ్చు కొత్త కెమెరా మాడ్యూల్ కారణంగా).కలర్ ఆప్షన్లు: Graphite Black, Iolite Silver, Garnet Red (మరిన్ని రంగులు రావచ్చు).

ధర & అందుబాటు

అమెజాన్ లీక్ ప్రకారం యూరప్‌లో €1,868.99 (జర్మనీ), £1,728 (UK) ధర ఉండవచ్చు. ఇది గత మోడల్ కంటే ఎక్కువ.